AP Election 2024: చిత్తూరులో హై టెన్షన్.. భారీగా పోలీసులు.. అసలేం జరుగుతోంది..?
ABN , Publish Date - May 02 , 2024 | 10:39 PM
అధికార వైసీపీ(YSRCP) అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసీపీ పలు కుట్రలకు తెరదీసింది. ఇందులో భాగంగానే చిత్తూరు జిల్లాలో వైసీపీకి బలంగా ఉన్న ప్రత్యర్థి పార్టీ నేతలపై కుట్రకు పన్నింది. ఇందులో భాగంగానే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలకు అడ్డుగా ఉన్న బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ (Ramachandra Yadav)పై పోలీసులను ఉసిగోల్పుతున్నారు.
చిత్తూరు: అధికార వైసీపీ (YSRCP) అరాచకాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసీపీ పలు కుట్రలకు తెరదీసింది. ఇందులో భాగంగానే చిత్తూరు (Chittoor) జిల్లాలో వైసీపీకి బలంగా ఉన్న ప్రత్యర్థి పార్టీ నేతలపై కుట్రకు పన్నింది. ఇందులో భాగంగానే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలకు అడ్డుగా ఉన్న బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ (Ramachandra Yadav)పై పోలీసులను ఉసిగోల్పుతున్నారు. ఆయనపై లేని కేసులు పెట్టించి అక్రమంగా జైలుకు పంపించేందుకు ప్లాన్ చేశారు.
దీనిలో భాగంగానే పుంగనూరులో రామచంద్ర యాదవ్ ఇంటి వద్ద పోలీసులు భారీగా చేరుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఆయన ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రెండు రోజుల క్రితం సదుం సంఘటనలో రామచంద్ర యాదవ్‌పై కూడా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఈ కేసులో రామచంద్ర యాదవ్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అకారణంగా ఆయనకు తెలియకుండానే పోలీసులు మరి కొన్ని కేసులు నమోదు చేసినట్టు సమాచారం. అరెస్టు చేసేందుకు ఆయన ఇంటి వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. దీంతో ఆయన ఇంటి వద్ద ఏ క్షణానికి ఏం జరుగుతుందో అన్న టెన్షన్ నెలకొంది.
AP Elections: నీవు చస్తే ఎవడైనా విగ్రహం పెడతాడా?..ముద్రగడపై పృథ్వి ఫైర్
Read latest AP News And Telugu News