Home » Perni Nani
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో నిబంధనల సడలింపుపై సీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై గతంలో నిబంధనలు పంపారన్నారు. పోస్టల్ బ్యాలెట్ కవర్లు, 13ఏ, 13బి నిబంధనలను చెప్పారన్నారు. గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వెయ్యాలని.. అలాగేస్టాంప్ లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని గతంలో ఆదేశించారన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. అధికార వైసీపీలోని అగ్గి వీరులు.. అదే నండి ఫైర్ బ్రాండ్లు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, ఆర్కే రోజా, జోగి రమేష్, అంబటి రాంబాబు వగైరా వగైరా ఎక్కడ అనే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతుంది.
తన వారసుడిగా కొడుకు పేర్ని కిట్టును రంగంలోకి దించేందుకు సీనియర్లను పేర్ని పక్కనపెట్టారు. కిట్టును ఎలాగైనా గెలిపించుకోవాలని నానా తంటాలు పడుతున్నారు. ఇందుకు ..
టీడీపీ కూటమి చేతిలో తన ఓటమి తథ్యమని భావిస్తున్న అధికార వైసీపీ.. ఓటర్లను ప్రలోభ పెట్టే పనులను మొదలుపెట్టింది. ఎన్నికల సంఘం ఎన్నిసార్లు వారించినా.. ఓటర్లను ప్రలోభ పెట్టొద్దని సూచించినా..
ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ నేతలు ఏం చేస్తారో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఓట్లను కొనుగోలు చేసేందుకు డబ్బులను పంపిణీ చేయడం, మద్యపానం సరఫరా చేయడం వంటివి చేస్తారు.
Andhrapradesh: బందరు తాలుకా పోలీస్ స్టేషన్ పై దుమ్మీకి వెళ్లిన పేర్ని నాని, అతని కుమారుడు కిట్టుపై కేసు నమోదు చేయాలని మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. బందరు మండలం ఆర్ గొల్లపాలెంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వందలాది వైసీపీ శ్రేణులతో తాలుకా పీఎస్ వద్ద అలజడి సృష్టించిన తండ్రీ, కొడుకులపై కేసు నమోదు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhrapradesh: జిల్లాలోని బందరు తాలుకా పోలీస్స్టేషన్ ముందు వైసీపీ ఎమ్మెల్యే పేర్నినాని, ఆయన అనుచురులు చేసిన హాంగామాపై పోలీసులు చర్యలకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే పేర్నినాని, అతని అనుచురులపై చిలకలపూడి పోలీస్స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఐపీపీ 188, 143, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిన్న(మంగళవారం) వైసీపీ శ్రేణులతో కలిసి బందరు తాలుకా ఎస్ఐ చాణిక్యపై పేర్నినాని దౌర్జన్యానికి దిగారు.
ఏపీలో పాలిటిక్స్(AP Politics) మరింత రసవత్తరంగా సాగుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి. వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. తాజాగా ఇదే అంశంలో.. మాజీ మంత్రి పేర్ని నానికి(Perni Nani) బీజేపీ(BJP) సీనియర్ నాయకుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
వలంటీర్ల ద్వారా పెన్షన్ నగదుని పంపిణీ చేయవద్దంటూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వైసీపీ తన కుటిల బుద్ధిని ప్రదర్శిస్తోంది. ఈ విషయంలో ఆ పార్టీ నేతలు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారు. తమదారి తమ అన్నట్టుగా వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పేర్ని నాని అనుచరులు రోజు రోజుకీ రెచ్చిపోతున్నారు. మొన్న ఉల్లిపాలెంలో ఓ టీడీపీ సానుభూతిపరుడిపై దాడి జరిగింది. నేడు జనసైనికుడిపై మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు.