Home » Pinarayi Vijayan
కేరళ ప్రభుత్వం అసాధారణ చర్యకు దిగింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన నాలుగు బిల్లులపై సంతకాలు చేయకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అసాధారణ జాప్యం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.
రేషన్ షాపుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటో పెట్టాలని కేరళ సర్కార్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ ఆదేశాలను కేరళ సీఎం పినరయి విజయన్ తప్పు పట్టారు.
భారతీయ విద్యార్థి ఫెడరేషన్(SFI) నిరసనకారులపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ శనివారం రోడ్డు పక్కన కూర్చుని నిరసన తెలిపిన తీరు గురించి కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు.
కేవలం 8 బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు రెండేళ్ల సమయం కూడా సరిపోలేదా..? గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అసలు ఏం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. శాసన సభ ఆమోదించిన 8 బిల్లులను గవర్నర్ తొక్కి పెడుతున్నారంటూ కేరళ సర్కారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Israel-Hamas War: కేరళ సీఎం పినరయి విజయన్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలస్తీనాకు సంఘీభావం తెలిపిన ఆయన.. భారత్‌ను ఇజ్రాయెల్ ఆయుధంగా వాడుకుంటోందని కుండబద్దలు కొట్టారు. ఇజ్రాయెల్ విషయంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాన్ని.. మన భారతదేశ వైఖరిగా పరిగణించొద్దని పేర్కొన్నారు.
బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు హత్యా బెదిరింపులు వచ్చాయి. కేరళ పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి.. కేరళ సీఎంని చంపేస్తామని చెప్పి..
ఇటీవల జరిగిన ఇస్లామిక్ గ్రూప్ కార్యక్రమంలో ఒక హమాస్ నాయకుడు వర్చువల్ ప్రసంగం చేశాడన్న అంశం కేరళలో వివాదాస్పదంగా మారింది. దీనిపై బీజేపీ అక్కడ నానా రాద్ధంతం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్...
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారంలోకి వస్తే ఇండియా తీవ్ర ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. అదే జరిగితే ఆ తర్వాత విచారించి కూడా ఏమాత్రం ప్రయోజనం ఉండదని అన్నారు.
కొంతకాలం నుంచి నిపా వైరస్ కేరళ రాష్ట్రంలో తీవ్ర కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా.. కోజికోడ్ జిల్లాలో ఈ నిపా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. ఇది కరోనా వైరస్ కంటే ప్రాణాంతకమైన వైరస్ కావడంతో..
కేరళలో గడిచిన 15 రోజుల్లో రెండు నిఫా వైరస్ మరణాలు సంభవించాయి. దీంతో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సీఎం పినరయి విజయన్ ఆదేశాల మేరకు వైరస్ వెలుగుచూసిన కోజికోడ్ జిల్లాలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. 7 గ్రామ పంచాయతీలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.