Share News

Kerala Against Droupadi Murmu: రాష్ట్రపతి తీరుపై సుప్రీంకోర్టులో కేరళ ప్రభుత్వం పిటిషన్

ABN , Publish Date - Mar 23 , 2024 | 06:29 PM

కేరళ ప్రభుత్వం అసాధారణ చర్యకు దిగింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన నాలుగు బిల్లులపై సంతకాలు చేయకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అసాధారణ జాప్యం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది.

Kerala Against Droupadi Murmu: రాష్ట్రపతి తీరుపై సుప్రీంకోర్టులో కేరళ ప్రభుత్వం పిటిషన్

న్యూఢిల్లీ: కేరళ ప్రభుత్వం (Kerala Government) అసాధారణ చర్యకు దిగింది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన నాలుగు బిల్లులపై సంతకాలు చేయకుండా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) అసాధారణ జాప్యం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్ వేసింది. రాష్ట్రపతి వద్ద యూనివర్శిటీ లాస్ (ఎమెండమెంట్) (నెంబర్ 2) బిల్లు-2021, కేరళ కో-ఆపరేటివ్ సొసైటీస్ (అమెండమెంట్) బిల్లు 2022, యూనివర్శిటీ లాస్ (అమెండమెంట్) బిల్లు-2022, యూనివర్శిటీ లాస్ (అమెండమెంట్) (నెంబర్ 3) బిల్లు-2022 పెండింగ్‌లో ఉన్నాయని, ఎలాంటి కారణం చెప్పకుండానే వాటిని పక్కన పెట్టేశారని పినరయి సర్కార్ ఆ పిటిషన్‌లో పేర్కొంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెక్రటరీ, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ఆయన అదనపు కార్యదర్శి పేర్లను కూడా సీపీఎం సారథ్యంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం చేర్చింది.


కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ తన వద్ద ఏడు బిల్లులు పెండింగ్‌లో పెట్టుకున్నారని, అందులో నాలుగు బిల్లులు చాలా జాప్యం తరువాత రాష్ట్రపతికి పంపగా, అక్కడ కూడా పెండింగ్‌లో ఉండిపోయాయని పిటిషన్‌లో కేరళ సర్కార్ వివరించింది. ఇలా అసాధారణ జాప్యం చోటుచేసుకోవడం చట్టం ముందు అందరూ సమానమనే రాజ్యాంగంలోని సెక్షన్ 14ని ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది. రాజ్యాంగంలోని 22 సెక్షన్ ప్రకారం కేరళ రాష్ట్ర ప్రజలకు అందాల్సిన సంక్షేమం అందకుండా చేసినట్టు అవుతుందని పేర్కొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 23 , 2024 | 06:29 PM