Home » Police
మంగళ్‌హాట్ పోలీస్‌స్టేషన్ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. సిటీ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి(City Commissioner Kottakota Srinivas Reddy) ఒకేరోజు ఐదుగురు కానిస్టేబుళ్లపై వేటువేయడం పోలీసువర్గాల్లో చర్చనీయాంశమైంది.
జమ్మూ కశ్మీర్(Jammu and Kashmir)లో ఉగ్రవాదులు మళ్లీ దాడికి(Terrorists Attack) పాల్పడ్డారు. దోడా జిల్లా(Doda district)లోని ఆర్మీకి చెందిన టెంపరరీ ఆపరేటింగ్ బేస్ (TOB)పై దాడి చేసి కాల్పులు ప్రారంభించారు.
గొర్రెల పంపిణీ పథకంలో వెలుగు చూసిన రూ.700 కోట్ల కుంభకోణం కేసులో పోలీసుల కస్టడీలో ఉన్న నిందితులు రాంచందర్, కల్యాణ్-- దర్యాప్తు అధికారుల ప్రశ్నలకు మౌనంగా ఉంటున్నట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి పలు కోణాల్లో సమాధానాలను రాబట్టుకునేందుకు అధికారులు ప్రశ్నించినా సమాధానాల్లేవని సమాచారం.
సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు అధికారులు మంగళవారం నాంపల్లి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కేసు దర్యాప్తు పురోగతి, నిందితుల వాంగ్మూలాలు, సేకరించిన ఆధారాలను చార్జ్‌షీట్‌లో వివరించారు. మార్చి 10న ఎఫ్‌ఐఆర్ నమోదవ్వగా.. ఇప్పటి వరకు ఆరుగురు నిందితులను గుర్తించామని, వారిలో నలుగురిని-- టాస్క్‌ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్‌రావు, మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావును అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
మావోయిస్టుల ఏరివేత పేరుతో అడవుల్లో బలగాల మోహరింపు.. దానికి కౌంటర్‌గా పోలీసులే లక్ష్యంగా బూబీట్రాప్స్, మందుపాతరలతో నక్సల్స్ ప్రతివ్యూహాలతో ఛత్తీ్‌సగఢ్-తెలంగాణ సరిహద్దు ఏజెన్సీల పౌరులు గజగజ వణికిపోతున్నారు. ఇటీవల వాజేడు మండలం కొంగాల అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరకు ఏసు అనే స్థానికుడు బలవ్వడంతో.. ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజనులు విలవిల్లాడుతున్నారు.
సుదీర్ఘంగా పనిచేసి ప్రజలకు మీరందించిన సేవలు పోలీస్ శాఖ ఎన్నటికీ మరువదని జిల్లా ఎస్పీ గౌతమిశాలి అన్నారు. జిల్లాలో ఇటీవల 9 మంది పదవీ విరమణ పొందారు. మంగళవారం వారిలో ఏడుగురికి జిల్లా ఎస్పీ చేతులమీదుగా స్థానిక పోలీసు కాన్ఫరెన్స హాలులో సన్మానం చేశారు. పదవీ విరమణ పొందిన ఎస్‌ఐ వెంకటాచలపతి, ఏఎ్‌సఐలు నాగరాజు, సయ్యద్ ఇబ్రహీం, జనార్దన, ఏఆర్‌ఎ్‌సఐ ఖాదర్‌బాషా, శంకర్‌నాయక్, హెడ్‌కానిస్టేబుల్ గౌస్ పీరా దంపతులను ఎస్పీ పూలమాలలు, శాలువాలతో సత్కరించారు.
కొన్నిసార్లు సినిమా తరహా ఘటనలు నిజ జీవితంలోనూ జరుగుతుంటాయి. మరికొన్నిసార్లు సినిమా సీన్లను మించిన ఘటనలు చోటు చేసుకోవడం చూస్తుంటాం. కొందరు సినిమా హీరోల్లా ధైర్యసాహసాలు ప్రదర్శిస్తూ అందరి మన్ననలూ పొందుతుంటారు. ఇలాంటి...
పచ్చిరొట్ట విత్తనాలు పక్కదారి పట్టిన వ్యవహారంలో విచారణాధికారి తప్పుడు నివేదికను ఇచ్చారని.. అందులో తమకు ఎలాంటి ప్రమేయం లేదని సస్పెండైన ఏఈవోలు అరవింద్, జమున, దీపిక మహబూబాబాద్ జిల్లా వ్యవసాయాధికారికి శనివారం లేఖ రాశారు.
అమాయకుల ఆధార్ కార్డులను సేకరించి వాటిలో చిరునామా మార్చడంతోపాటు వారి పేరిట తప్పుడు పత్రాలతో బ్యాంకుల నుంచి రుణాలు పొందుతున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు నల్లగొండ జిల్లా ఎస్పీ చందన దీప్తి శనివారం తెలిపారు.
నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన ముగ్గురు అరెస్టు అయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. ఢీవీ ప్రాజెక్ట్స్ అనే సంస్థ పార్లమెంట్ భవన సముదాయంలోని ఎంపీల లాంజ్ నిర్మాణ పనులను నిర్వహిస్తోంది. ఈ సంస్థ తరఫున కార్మికులుగా వచ్చిన ఖాసిమ్, మోనిస్, సోయబ్ నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించేందుకు యత్నించి ఫ్లాప్ గేట్ వద్ద జరిగిన తనిఖీల్లో పట్టుబడ్డారు.