నకిలీ ఆధార్‌తో పార్లమెంట్‌లోకి యత్నించిన ముగ్గురి అరెస్టు
ABN , Publish Date - Jun 08 , 2024 | 03:44 AM
నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన ముగ్గురు అరెస్టు అయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. ఢీవీ ప్రాజెక్ట్స్ అనే సంస్థ పార్లమెంట్ భవన సముదాయంలోని ఎంపీల లాంజ్ నిర్మాణ పనులను నిర్వహిస్తోంది. ఈ సంస్థ తరఫున కార్మికులుగా వచ్చిన ఖాసిమ్, మోనిస్, సోయబ్ నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించేందుకు యత్నించి ఫ్లాప్ గేట్ వద్ద జరిగిన తనిఖీల్లో పట్టుబడ్డారు.
న్యూఢిల్లీ, జూన్ 7: నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన ముగ్గురు అరెస్టు అయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. ఢీవీ ప్రాజెక్ట్స్ అనే సంస్థ పార్లమెంట్ భవన సముదాయంలోని ఎంపీల లాంజ్ నిర్మాణ పనులను నిర్వహిస్తోంది. ఈ సంస్థ తరఫున కార్మికులుగా వచ్చిన ఖాసిమ్, మోనిస్, సోయబ్ నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించేందుకు యత్నించి ఫ్లాప్ గేట్ వద్ద జరిగిన తనిఖీల్లో పట్టుబడ్డారు.
తమ గుర్తింపు కోసం వారు తెచ్చిన ఆధార్ కార్డులు అనుమానాస్పదంగా ఉండడంతో సీఐఎ్‌సఎఫ్ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారి ఆధార్ కార్డులు నకిలీవని తేలడంతో పోలీసులకు అప్పగించారు. నిందితుల్లో ఇద్దరి ఆధార్ కార్డులపై ఒకే ఆధార్ నంబర్ ఉండగా ఫొటోలు వేరుగా ఉన్నాయి. నిందితులను అరెస్టు చేసిన ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
2023 డిసెంబరులో ఇద్దరు విజిటర్స్ గ్యాలరీ నుంచి లోక్‌సభలోకి దూసుకొచ్చి పొగ డబ్బాలు తెరిచి అలజడి సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనకు సంబంధించిన పార్లమెంట్ భద్రత ఉల్లంఘన కేసులో ఆరుగురు నిందితులపై ఢిల్లీ పోలీసులు న్యాయస్థానంలో శుక్రవారం చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో అనుబంధ చార్జిషీట్ దాఖలుకు న్యాయస్థానం జూలై 15 వరకు గడువిచ్చింది.