Home » Pravasa
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) ఫౌండేషన్‌లో భారీ స్కాం వెలుగు చూసింది. ఈ ఫౌండేషన్ మాజీ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు.. భారీగా నిధులను తన సొంత కంపెనీకి మళ్లించినట్లు తానాలోని పెద్దలు గుర్తించారు.
హాంగ్‌కాంగ్‌లో బతుకమ్మ సంబరాలు అంబరాన్నాంటాయి. ఓకే చోటకు మహిళలంతా చేరి బతుకమ్మ ఆడారు. తర్వాత అందరూ కలిసి విందు భోజనం ఆరగించారు. ప్రతీ ఏటా బతుకమ్మ, దసరా పండగలను ఘనంగా నిర్వహించుకుంటామని తెలిపారు.
2025 తానా (TANA) మహాసభల సమన్వయకర్త నియామక ప్రక్రియ చెల్లదని ప్రస్తుత తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు తానా సంస్థకు లీగల్ నోటీసులు పంపారు. ఈ మేరకు బోర్డు ఛైర్మన్ డా. కొడాలి నాగేంద్ర శ్రీనివాస్, తానా కార్యదర్శి కసుకుర్తి రాజాలకు నోటీసులు పంపించారు.
ఎడారి దేశంలో కన్న తండ్రి కన్నుమూస్తే కడసారి చూడడానికి ఆ దేశంలో ఉన్న కొడుకు చూడలేని పరిస్థితి. భుజాల మీద మోసి, పెద్ద చేసిన తండ్రికి కడసారి వీడ్కోలు పలుకలేపోయాడు. ఎలాగోలా ధైర్యం చేసి వచ్చేసిన ఆ కుమారుడికి నిరాశే మిగిలింది. 900 కిలో మీటర్ల దూరం వచ్చేసరికి కన్న తండ్రి మృతదేహం మాతృదేశానికి వెళ్ళిందని తెలిసి కన్నీరు మున్నీరయ్యాడు.
ఉపాధి కోసం అరబ్ దేశానికి వచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళకు సాయం అందింది. చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం తుర్కపల్లె గ్రామానికి చెందిన షేక్ హసీనా అనే యువతి గల్ఫ్ దేశంలో సాయం కోసం చూసింది. తనను రక్షించాలని మంత్రి నారా లోకేశ్‌కు సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసింది. లోకేష్ పిలుపు మేరకు సౌదీ అరేబియాలో ఏపీ ఎన్ఆర్ఐ ప్రతినిధి స్పందించారు.
తానా సాహిత్య విభాగం ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో భాగంగా.. ఆదివారం నిర్వహించిన 66వ సాహిత్య సమావేశం ‘‘మన ప్రాచీన భారతీయ సాహిత్యం.. ఆధునిక విశ్వ విజ్ఞానశాస్త్ర వికాసానికి మూలం’ అనే కార్యక్రమం ఘనంగా, విజ్ఞానదాయకంగా జరిగింది.
తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (TPAD) వార్షికోత్సవాన్ని రక్తదాన శిబిరంతో ప్రారంభించాయి. టీపీఏడీ ఏర్పడినప్పటి నుంచి రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. గత మూడేళ్ల నుంచి ఏడాదికి రెండుసార్లు రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇది 13వ రక్తదాన శిబిరం అని నిర్వహకులు తెలిపారు.
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) విజయోత్సవ వేడుకలు శనివారం నాడు వాషింగ్టన్ డిసిలో జరిగాయి. డాకర్ట్ నరేన్ కొడాలి వర్గం, తానా సభ్యులు, శ్రేయోభిలాషులు 600 మంది పాల్గొన్నారు. తానా ఎన్నికలు జనవరి 24వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. అన్ని పదవుల్లో నరేన్ కొడాలి వర్గం విజయం సాధించింది. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని మరో వర్గం కోర్టును ఆశ్రయించింది. విచారణ జరిగి, తానా ఎన్నికను కోర్టు ఆమోదించింది. దాంతో మార్చి 23వ తేదీన తానా సభ్యులు బాధ్యతలు చేపట్టి, విజయోత్సవ సభ నిర్వహించారు.
కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఎలుకపాడుకు చెందిన మూల్పూరు రమేష్ మనమవరాలు వేమూరు ఉజ్వల. ఆస్ట్రేలియాలో మెడిసిన్ పూర్తి చేసింది. ట్రెక్కింగ్‌కు వెళ్లి కన్నుమూసింది. ఉజ్వల గోల్డ్ కోస్ట్‌లో గల గల బాండ్ యూనివర్సిటీలో మెడిసిన్ పూర్తి చేశారు. రాయల్ బ్రిస్బేన్ ఉమెన్స్ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఇంతలో విషాదం నెలకొంది.
ఉత్తర అమెరికా తెలుగు సంఘం బోర్డు చైర్మన్ పదవి ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. డాక్టర్ నాగేంద్ర శ్రీనివాస్ కొడాలిని సభ్యులు ఎన్నుకున్నారు. బోర్డు సమావేశంలో చైర్మన్, కార్యదర్శి, కోశాధికారిని సభ్యులు ఎన్నుకున్నారు. బోర్డు కార్యదర్శిగా శ్రీమతి లక్ష్మి దేవినేని, కోశాధికారిగా శ్రీ జనార్దన్ (జానీ ) నిమ్మలపూడి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.