NRI: తానాలో భారీ స్కాం.. షోకాజ్ నోటీసులు జారీ
ABN , Publish Date - Nov 25 , 2024 | 08:57 PM
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా(తానా) ఫౌండేషన్‌లో భారీ స్కాం వెలుగు చూసింది. ఈ ఫౌండేషన్ మాజీ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు.. భారీగా నిధులను తన సొంత కంపెనీకి మళ్లించినట్లు తానాలోని పెద్దలు గుర్తించారు.
వాషింగ్టన్, నవంబర్ 25: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఫౌండేషన్‌లో భారీ స్కామ్ వెలుగు చూసింది. ఫౌండేషన్ మాజీ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు ఎవరిని సంప్రదించకుండా ఇర్వింగ్ టెక్సాస్‌లోని తన సొంత కంపెనీ బృహత్ టెక్నాలజీస్‌కి సుమారు మూడు మిలియన్ డాలర్లపైగా నిధులు మళ్లించడాన్ని తానా బోర్డు తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో శనివారం అంటే.. 2024, నవంబర్ 23వ తేదీన తానా బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించింది.
Also Read: టౌన్ ప్లానింగ్‌లో సంస్కరణలు.. ఆ రోజు నుంచి అమలు
Also Read: జోన్న రోట్టి వల్ల ఇన్ని లాభాలున్నాయా?
ఈ సమావేశంలో శ్రీకాంత్ పోలవరపు వ్యవహారంపై సభ్యులంతా చాలా సీరియస్ అయ్యారు. శ్రీకాంత్ పోలవరపు దారి మళ్లించిన నిధులను మళ్లీ వెనక్కి తీసుకు వచ్చేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. అలాగే సోమవారం అంటే.. 2024, నవంబర్ 25వ తేదీన జరిగే తదుపరి బోర్డు సమావేశానికి హాజరు కావాలంటూ శ్రీకాంత్ పోలవరపుకి షోకాజు నోటీసు జారీ చేశారు.
Also Read: గూగుల్ మ్యాప్స్‌పై కేసు వేయొచ్చా..?
Also Read: చూశారా.. ఎంపీ గారి సింప్లిసిటీ
తానా బోర్డ్ చైర్మన్ డా. శ్రీనాగేంద్ర శ్రీనివాస్ మాట్లాడుతూ.. నిధులు వెనక్కి వచ్చేలా తగు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అందుకోసం న్యాయపరమైన సలహాలు తీసుకుంటామన్నారు. అయితే తానా ఫౌండేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతామని ఆయన చెప్పారు. శ్రీకాంత్ పోలవరపు ఎవరితో ఎలాంటి సంప్రదింపులు జరపకుండా.. ఎవరి అనుమతి లేకుండా నిధులు మళ్లించారని ఆయన తెలిపారు.
Also Read: కొత్త రేషన్ కార్డుల మంజూరుపై ప్రభుత్వం కీలక నిర్ణయం
Also Read: అదానీ పెట్టుబడులపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
ఇప్పటికే.. ఈ వ్యవహారంపై శ్రీకాంత్ పోలవరపుతో తానా ఫౌండేషన్ చైర్మన్ శ్రీ శశికాంత్ వల్లేపల్లితోపాటు తాను చర్చించామన్నారు. ఈ నిధుల మళ్లింపు జరిగిన మాట వాస్తవమేనని శ్రీకాంత్ పోలవరపు స్పష్టం చేశారని చెప్పారు. ఇది తన సొంత నిర్ణయమని ఆయన పేర్కొన్నారని తెలిపారు. అయితే ఈ సంఘటనకి తాను పూర్తి బాధ్యత వహిస్తానని ఈ మెయిల్ ద్వారా తమకు తెలిపారని శ్రీనాగేంద్ర శ్రీనివాస్ కొడాలి వెల్లడించారు.