Home » Purandeswari
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కలిశారు. అధ్యక్షురాలిగా నియమించడంపై నడ్డాకు పురంధేశ్వరి కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకానికి నడ్డాకు కృతజ్ఞతలు తెలిపినట్లు పురంధేశ్వరి వెల్లడించారు.
బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ వ్యవస్థాపక నేత శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
పురందేశ్వరికి బీజేపీ ప్రాధాన్యం ఇవ్వటంపై రెండు రకాల చర్చలు కొనసాగుతున్నాయి. టీడీపీని దగ్గర చేసుకునే క్రమంలో ఇదో ప్రయత్నంగా అత్యధికులు భావిస్తున్నారు. కాగా కమ్మ సామాజికవర్గం.. ప్రధానంగా టీడీపీ శ్రేణుల్లో అయోమయ స్థితిని కల్పించి వైసీపీకి ఉపయోగపడేందుకే బీజేపీ పురందేశ్వరికి పదవిని ఇచ్చిందన్న అనుమానాలు వ్యక్తం చేసేవారు లేకపోలేదు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి మార్పుపై సీపీఐ నేత రామకృష్ణ స్పందించారు.
బీజేపీని ఈ స్థాయికి తెచ్చిన బండి సంజయ్‌ను పక్కనెట్టి మరీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి (Kishan Reddy) అగ్రనాయకత్వం ఎందుకు ఈ పదవి కట్టబెట్టింది..? అది కూడా రెండోసారి ఎందుకిచ్చింది..? ఇంత మంది సీనియర్లు, ముఖ్యనేతలు వద్దనుకుని కిషన్‌రెడ్డే ఆ పదవి ఎందుకు..? అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది..? అనే ప్రశ్నలు బీజేపీ శ్రేణుల నుంచి వస్తున్నాయి..
అవును.. తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా బీజేపీ అగ్రనాయకత్వం (BJP High Command) భారీగా మార్పులు, చేర్పులు చేసింది. ముఖ్యంగా తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో గులాబీ బాస్ కేసీఆర్‌ను (CM KCR) మూడోసారి ముఖ్యమంత్రిని కానివ్వకూడదని బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా వ్యూహాత్మకంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని మార్చింది.
ఎన్నికల ముందు బీజేపీ (BJP) అగ్రనాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా అనుకున్నట్లుగా.. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’లో ప్రసారమైన తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షుల మార్పుకు సంబంధించిన ప్రత్యేక కథనాలన్నీ అక్షరాలా నిజమయ్యాయి..
ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియమితులయ్యారు. చడీ చప్పుడు కాకుండా ఏపీ అధ్యక్షుడి పదవి నుంచి సోమువీర్రాజును తొలగించిన అధిష్టానం.. కొత్త అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కాసేపటి క్రితమే అధికారిక ప్రకటన విడుదలైంది. ఏపీ బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిందిగా సోముకు అధిష్టానం ఆదేశించింది.
ఏపీ ప్రభుత్వంపై బీజేపీ నేత పురందేశ్వరి (Purandeswari) తీవ్రస్థాయితో మండిపడ్డారు. అరాచక పాలనతోనే ఏపీకి పెట్టుబడులు రావడం లేదని
విశాఖ: సీబీఐ (CBI) అనేది స్వతంత్ర సంస్థ అని, దానిపై ఎవరి ప్రభావం ఉండదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురందేశ్వరి (Purandeswari) అన్నారు.