BJP: శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకల్లో ఆసక్తికర ఘటన

ABN , First Publish Date - 2023-07-06T13:08:08+05:30 IST

బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ వ్యవస్థాపక నేత శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.

BJP: శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకల్లో ఆసక్తికర ఘటన

విజయవాడ: బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ వ్యవస్థాపక నేత శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకల్లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షురాలు పురంధేశ్వరి (AP BJP Chief Purandheshwari) నియామకాన్ని స్వాగతిస్తున్నామని ప్రధాన కార్యదర్శి వేటుకూరి సూర్యనారాయణ రాజు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు (Somuveerraju) చేతుల మీదుగా కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు. సోము వీర్రాజుకు కూడా నేతలు స్వీట్ తినిపించారు. పురంధేశ్వరీ నాయకత్వం వర్ధిల్లాలి అంటూ కార్యకర్తల నినాదాలు చేశారు. బీజేపీ ఏపీ కొత్త అధ్యక్షురాలిగా నియమితులైన పురంధేశ్వరీకి భారీ స్వాగతం పలకాలని నిర్ణయం తీసుకున్నారు. పురంధేశ్వరీ బాధ్యతల స్వీకరణ సందర్భంగా భారీ బహిరంగను బీజేపీ ఏర్పాటు చేయనుంది. వచ్చే వారం పది రోజుల్లో బహిరంగ సభ ఏర్పాటు చేసే దిశగా కసరత్తు మొదలుపెట్టారు. పురంధేశ్వరీకి పార్టీ నేతలు.. కార్యకర్తలు సహకరించి పార్టీ బలోపేతం కృషి చేయాలని పార్టీ హైకమాండ్ సూచించిన విషయం తెలిసిందే.

Powered byPerformoo logo
The video is not available or it's processing - Please check back later.

Updated Date - 2023-07-06T13:08:08+05:30 IST

News Hub