Home » Rajahmundry
టీడీపీ అధినేత చంద్రబాబును జైల్లో పెట్టి తాను రాష్ట్రమంతా తిరగాలని జగన్ చూస్తున్నారని.. అందుకోసమే ఈరోజు జగన్ సామర్లకోట వచ్చారని ఎమ్మెల్యే చినరాజప్ప అన్నారు.
రాజమండ్రి: తెలుగుదేశం అధినేత చంద్రబాబును మంగళవారం సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలులో నారా భువనేశ్వరి, బ్రహ్మణి కలిసారు. వారితో పాటు టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్య్ పయ్యావుల కేశవ్ ఉన్నారు.
రాజమండ్రి: స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రహ్మణి శుక్రవారం సాయంత్రం ములాఖత్ అయ్యారు. సుమారు 45 నిముషాలపాటు వారు చంద్రబాబుతో మాట్లాడనున్నారు.
స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా ఈరోజు సత్యాగ్రహ దీక్షకు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెట్రల్ జైలులోనే సత్యమేవ జయతే దీక్షను ప్రారంభించారు. అలాగే చంద్రబాబు సతీమణి భువనేశ్వరి రాజమండ్రిలో దీక్షను మొదలుపెట్టారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఏ తప్పు చేయలేదని నమ్మి అంతా నిరసన తెలుపుతున్నారని నారా భువనేశ్వరి అన్నారు. మంగళవారం చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా సీతానగరంలో భువనేశ్వరి రిలే నిరాహార దీక్ష చేపట్టారు.
రాజమండ్రి శ్రీ సిద్ది లక్ష్మీ గణపతి ఆలయంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వినాయక చవతిని పురస్కరించుకుని శ్రీ సిద్దిలక్ష్మీ గణపతి స్వామి వారి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
రాష్ట్రంలో యుద్ధవాతావరణం సృష్టిస్తున్నారని వైసీపీపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ-జనసేన పొత్తుకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనిపై స్పందిస్తూ... ఏపీ చరిత్రలో కీలక నిర్ణయం తీసుకున్నామని.. కలిసికట్టుగా వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు, కడప, విశాఖ, రాజమహేంద్ర వరంలో కేంద్ర కారాగారాలు ఉన్నాయి. వీటిలో రాజమహేంద్రవరం జైలు పెద్దది. ఉమ్మడి ఏపీలో వీఐపీలను చంచల్‌గూడ, రాజమహేంద్రవరం కేంద్ర కారాగారాలకు పంపించేవారు.
టీడీపీ చీఫ్ చంద్రబాబును జైలుకి పంపాలన్నది జగన్ రెడ్డి కల అని ఆ పార్టీ నేత కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు చేశారు.