Harsh Kumar: ఆంధ్రజ్యోతి పోటోగ్రాపర్‌పై వైసీపీ చేసిన దాడిపై సీఎం స్పందించాలి..
ABN , Publish Date - Feb 21 , 2024 | 11:14 AM
రాజమండ్రి: ఆంధ్రజ్యోతి పోటోగ్రాపర్‌పై వైసీపీ మూకలు చేసిన దాడిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించాలని, హైకోర్టు సుమోటోగా కేసు నమోదు చేయాలని, గవర్నర్ కూడా స్పందించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి రాజకీయ పార్టీలు టిక్కెట్లు ఇవ్వకూడదని, ఎస్సీ నియోజకవర్గాల్లో పార్టీలో ఉన్నవారిని కాదని కొత్తవారికి టిక్కెట్లు ఇవ్వకూడదన్నారు.
రాజమండ్రి: ఆంధ్రజ్యోతి పోటోగ్రాపర్ (Andhrajyothy Photographer)పై వైసీపీ మూకలు చేసిన దాడిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) స్పందించాలని, హైకోర్టు (High Court) సుమోటోగా కేసు నమోదు చేయాలని, గవర్నర్ (Governor) కూడా స్పందించాలని మాజీ ఎంపీ హర్షకుమార్ (Ex MP Harsh Kumar) అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ.. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి రాజకీయ పార్టీలు టిక్కెట్లు ఇవ్వకూడదని, ఎస్సీ నియోజకవర్గాల్లో పార్టీలో ఉన్నవారిని కాదని కొత్తవారికి టిక్కెట్లు ఇవ్వకూడదన్నారు. జడ్జిలకు ప్రభుత్వాలు పదవులు కట్టబెట్టడం మంచిదికాదన్నారు. వైసీపీ ప్రభుత్వంలో దళితులపై దాడులు జరుగుతున్నాయని, వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని పిలుపునిచ్చామన్నారు. బీజేపీతో పొత్తు ఏవిదంగా ఉంటుందో చూడాలన్నారు.
పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు రాజకీయ పార్టీలు టిక్కెట్లు ఇవ్వకూడదని హర్ష కుమార్ అన్నారు. అమలాపురం పార్లమెంట్ పరిధిలో సొంతంగా సర్వే చేయించుకున్నామని, ప్రజల్లో ఉన్న ఆదరణతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలి అనుకుంటున్నామని చెప్పారు. జగన్ నవరత్నాలు అమలుచేయటంలో కూడా విఫలమయ్యారని విమర్శించారు. డీఎస్సీ నోటిపికేషన్ ఎన్నికల జిమ్మిక్కని, ఆళ్ళ రామకృష్ణారెడ్డి పార్టీలో నుంచి వెళ్ళటం, మళ్ళీ రావటం జగన్ ఎత్తుగడ అని.. సోదరి షర్మిలను కూడా జగనే కాంగ్రెస్‌లోకి పంపించి ఉండవచ్చునని హర్షకుమార్ అనుమానం వ్యక్తం చేశారు.