Home » RBI
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మరో చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది
2023 ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఎక్కువగా చలామణీ అయిన నోట్ల జాబితాలో 500 రూపాయల నోట్లు ముందు వరుసలో నిలిచాయి. దేశంలో చలామణీ అవుతున్న కరెన్సీ నోట్ల సంఖ్య 13,621 కోట్లు కాగా.. అందులో 5,163 కోట్ల నోట్లు 500 రూపాయల నోట్లే కావడం విశేషం.
రూ.2 వేల నోట్ల మార్పిడికి గుర్తింపు కార్డు అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. గుర్తింపు కార్డుల అవసరం లేకుండా రూ.2వేల నోట్లను మార్చుకోవడంపై ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. గుర్తింపుకార్డు, అప్లికేషన్‌లు లేకుండా ఒకేరోజు రూ.20 వేలు మార్చుకునేందుకు ఆర్‌బీఐ అనుమతించింది. గుర్తింపు కార్డు లేకపోతే నల్లధనం.. తెల్లధనం అవుతుందంటూ పిల్ దాఖలు చేశారు. ఢిల్లీ హైకోర్టు ఈ పిల్‌ను కొట్టివేసింది.
రూ.2000 నోట్ల మార్పిడి ప్రక్రియ నిరంతరాయంగా పూర్తవుతుందని భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంత దాస్ బుధవారం చెప్పారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆర్బీఐ మరో రెండు వేల కోట్ల రూపాయల అప్పు ఇచ్చింది. మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ప్రభుత్వం రూ. రెండు వేల కోట్ల రుణం తెచ్చింది.
రెండు వేల రూపాయల నోటు ఉపసంహరణపై (Rs 2000 notes withdrawal) అసత్యాలు ప్రచారమవుతున్న వేళ కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) కీలక ప్రకటన చేసింది.
న్యూఢిల్లీ: రూ.2,000 నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకోవడంతో కొత్తగా రూ.1000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తిరిగి ప్రవేశపెట్టనుందా? దీనిపై ఆర్బీఐ గవర్నర్ తాజా ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు. రూ.1,000 నోట్లు తిరిగి మార్కెట్లోకి ప్రవేశపెట్టాలనే ఆలోచన ప్రస్తుతానికి ఏదీ తమవద్ద లేదని చెప్పారు.
న్యూఢిల్లీ: రూ.2,000 నోట్ల మార్పిడి ప్రక్రియ ఈనెల 23 నుంచి ప్రారంభమవుతోందని, అన్ని బ్యాంకు కౌంటర్లలోను రూ. 2,000 నోట్లను ఇతర డినామినేషన్ల నోట్లుగా మార్చుకోవచ్చని, ఒక్కో విడతలో రూ.20 వేల విలువైన నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోవచ్చని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ) తెలిపారు.
న్యూఢిల్లీ: సుమారు ఏడేళ్ల క్రితం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత ఆర్బీఐ ముచ్చటపడి తీసుకువచ్చిన రూ.2,000 నోటు సైతం ఇప్పుడు 'ఔట్' అయింది. రూ.2,000 నోట్ల రద్దు ఈ ప్రభావం ఎవరిమీద ఉండబోతోంది? 2016లో మోదీ ప్రకటించిన నిర్ణయం అనంతరం ఎదురైన పరిణామాలు మళ్లీ పునరావృతం కానున్నాయా? అనే అంశాలపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది.
న్యూఢిల్లీ: 2016 నవంబర్ 8వ తేదీ రాత్రి సరిగ్గా 8 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టీవీ స్క్రీన్‌పై కనిపించారు. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. తక్షణం ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్టు ప్రకటించారు. దేశంలో నల్లధనాన్ని, అవినీతి సొమ్ముకు చెక్ పెట్టేందుకు, ఉగ్రవాదుల ఆర్థిక మూలాలను సమూలంగా దెబ్బతీసేందుకు పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామని వివరణ ఇచ్చారు. సామాన్య ప్రజానీకం మాత్రం కేంద్రం నిర్ణయంతో బెంబేలెత్తిపోయింది.