Home » Revanth
దొరల పాలన ముగిసిందనీ.. ప్రజా పాలన ప్రారంభమయిందనీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే వ్యాఖ్యానించిన రేవంత్.. ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. గురువారం రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా కనిపించిన రెండు దృశ్యాలు.. రేవంత్ పాలన విభిన్నంగా ఉండబోతోందని నిరూపిస్తోంది.
సీఎం రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు ఎల్బీ స్టేడియంలో ప్రమాణం చేస్తారు. ఈ కార్యక్రమం అయిన వెంటనే ప్రమాణ స్వీకార సభలో ముందుగా 6 గ్యారెంటీల అమలుపై తొలి సంతకం చేయనున్నారు. ఈ 6 గ్యారెంటీలు ఎప్పటి నుంచి అమలు కానున్నాయో సభా వేదికపై ఆయన ప్రకటించనున్నారు.
న్యూఢిల్లీ: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను కలుస్తూ బిజీ బిజీగా ఉన్నారు. గురువారం ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం ఉదయం ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాలతో భేటీ అయ్యారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మేజిక్ ఫిగర్‌ను దాటేసిన కాంగ్రెస్ పార్టీ.. సీఎం ఎంపికపై కసరత్తు చేస్తోంది. పార్టీ తరపున గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలతో కూడిన శాసనసభాపక్షం గచ్చిబౌళిలోని ఎల్ల హోటల్లో సోమవారం ఉదయం 9.30 గంటలకు సమావేశం కానుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలిచింది. దీంతో గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్ తమిళి సై సౌందర రాజన్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అందజేయనున్నది. ఈ మేరకు వారు రాజ్‌భవన్‌కు బయలు దేరి వెళ్లారు.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగియనుంది. ఎన్నికల బరిలో 2,290 ఉండగా.. వారిలో 221 మంది మహిళలు ఉన్నారు. అలాగే ఈరోజు సాయంత్రం నుంచి సోషల్ మీడియాలో ప్రకటనలకు అనుమతిలేదని ఎన్నికల కమిషన్ పేర్కొంది.
హైదరాబాద్: తెలంగాణ ఎన్నికల పోలింగ్‌కు ఇంకా నాలుగు రోజులే సమయమండడంతో ప్రధాన పార్టీల అగ్ర నేతలు ప్రచారం ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆదివారం ఆయా నియోజక వర్గాల్లో పర్యటించి ప్రచారం నిర్వహించనున్నారు.
RK Big Debate With Revanth Reddy : కచ్చితంగా అధికారంలోకి వచ్చేస్తామని.. ఇక ప్రమాణ స్వీకారమే ఆలస్యమని చెబుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌తో.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో ప్రత్యేక డిబేట్.. లైవ్‌లో చూడండి..
నామినేషన్ వేసేందుకు తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌కు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ఆయనకు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. ప్రజల ఆశీర్వాద బలంతో ముందుకు నడుస్తున్నానన్నారు.
హైదరాబాద్: మాజీ ఎంపీ వెంకటస్వామి కుటుంబానికి కాంగ్రెస్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. శనివారం ఉదయం బీజేపీ నేత వివేక్‌తో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.