Share News

ABN Big Debate With Revanth : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఏబీఎన్ ఎండీ ఆర్కే బిగ్ డిబేట్.. లైవ్‌లో చూడండి..

ABN , First Publish Date - 2023-11-16T18:44:51+05:30 IST

RK Big Debate With Revanth Reddy : కచ్చితంగా అధికారంలోకి వచ్చేస్తామని.. ఇక ప్రమాణ స్వీకారమే ఆలస్యమని చెబుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌తో.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో ప్రత్యేక డిబేట్.. లైవ్‌లో చూడండి..

ABN Big Debate With Revanth : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ఏబీఎన్ ఎండీ ఆర్కే బిగ్ డిబేట్.. లైవ్‌లో చూడండి..

బిగ్ డిబేట్‌ను ఇక్కడ చూడండి

09:05 PM : చంద్రబాబు జైలుకెళ్లడంపై..!

  • చంద్రబాబు జైలుకు వెళ్ళడం కరెక్టా కాదా చర్చించను

  • చంద్రబాబు జైలుకు వెళ్లడం తనకు వ్యక్తిగతంగా బాధని అనిపించింది

  • చంద్రబాబు అరెస్టును ఏపీ కాంగ్రెస్ పార్టీ ఖండించింది

  • ఈ ఎన్నికల్లో చంద్రబాబు అరెస్టును లాభనష్టాలతో చూడం

  • చంద్రబాబు అరెస్టుపై కేటీఆర్ బలుపు మాటలు మాట్లాడారు

  • హైదరాబాద్‌లో ఆందోళన చేయవద్దని బెదిరించారు

  • ఆంధ్రావాళ్లను సెటిలర్స్ అంటూ వేరుచేసే ప్రయత్నం చేశారు

  • కేటీఆర్ మాటలు వారికి నష్టం కల్గిస్తాయి

  • పవన్‌కల్యాణ్‌ బీజేపీతో కలిసి తెలంగాణలో పోటీలో ఉన్నారు

  • జనసేనకు తక్కువ ఓట్లువస్తే ఆప్రభావం ఏపీపై ఉంటుంది

Revanth-And-Babu.jpg

08:55 PM : ప్రగతిభవన్‌ను మార్చి..!

  • కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ప్రగతిభవన్‌ను నాలెడ్జ్‌ సెంటర్‌గా మారుస్తాం

  • కేసీఆర్ ఇంట్లో కూర్చోని నిర్ణయాలు తీసుకున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ తీసుకోదు

  • అన్ని విషయాల్లో చర్చించే నిర్ణయాలు తీసుకుంటాం

  • రాజకీయాలు విషవలయంగా మారాయి

  • జగ్గారెడ్డి లాంటివారు రాజకీయాల్లో అప్పుల పాలవుతున్నారు

  • పదేళ్లపాటు అవకాశం ఉంటే తెలంగాణలో మార్పు చూపిస్తాం

08:45 PM : దేవుడు కూడా కాపాడలేడు!

  • కేసీఆర్‌తో పోటీపడుతున్నాను కాబట్టే ఆయనపై మాట్లాడుతున్నా

  • కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ హైదరాబాద్‌లో నిర్వహించే అవకాశం అధిష్ఠానం ఇచ్చింది

  • తెలంగాణ కాంగ్రెస్‌పై నమ్మకంతోనే ఆ అవకాశం ఇచ్చారు

  • కాంగ్రెస్ పార్టీ తెలంగాణపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టింది

  • ఈసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాకపోతే..

  • ప్రజలను దేవుడు కూడా కాపాడలేడు

Revanth-Dd.jpg

08:40 PM : కేసీఆర్ కుటుంబంలోనే గందరగోళం!

  • తెలంగాణను అభివృద్ధి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే

  • కేసీఆర్ కుటుంబంలోనే గందరగోళం ఉంది

  • కేసీఆర్ కుటుంబంలో ఎవరి దుకాణం వారికుంది

  • కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆ పరిస్థితి ఉండదు

  • కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రియల్‌ఎస్టేట్ పడిపోతుందని భయాందోళన కల్పిస్తున్నారు

  • మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే హైదరాబాద్‌ గ్రోత్‌ ఇప్పుడు కన్పిస్తోంది

  • తాము చేపట్టిన మాస్టర్‌ప్లాన్‌ వల్లే హైదరాబాద్‌ అభివృద్ధి చెందింది

  • హైదరాబాద్‌ విషయంలో కాంగ్రెస్‌కు ఓ ప్రణాళిక ఉంది

  • హైదరాబాద్‌ రింగ్‌రోడ్డు లోపల అర్బన్‌ హైదరాబాద్‌గా అభివృద్ధి చేస్తాం

  • రింగ్‌ రోడ్డు నుంచి ట్రిపుల్‌ ఆర్‌ మధ్య సెమీ అర్బన్‌గా అభివృద్ధి చేస్తాం

  • ట్రిపుల్‌ ఆర్‌ నుంచి తెలంగాణ సరిహద్దు వరకు రూరల్ తెలంగాణ అభివృద్ధి

  • అభివృద్ధిని హైదరాబాద్‌ చుట్టుపక్కల డీసెంట్రలైజ్‌ చేయాలనేది కాంగ్రెస్ లక్ష్యం

  • హైదరాబాద్‌ను ప్రపంచంలోని నగరాలతో అభివృద్ధి చేస్తాం

  • 40 శాతం ప్రజలు.. నగరాలు, పట్టణాల్లో ఉన్నారు

Big-Debate.jpg

08:30 PM : నేను రె‘ఢీ’..!!

  • కర్ణాటకలో 6 గ్యారంటీలు అమలువుతున్నాయి

  • ఉచిత కరెంట్‌ అనేది కాంగ్రెస్‌ పార్టీ పేటెంట్‌

  • 2004లో కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్‌ ఇచ్చింది

  • ABN బిగ్ డిబేట్‌లో BRSకు సవాల్‌ విసిరిన రేవంత్‌రెడ్డి

  • సబ్‌స్టేషన్‌ల దగ్గర రికార్డులను పరిశీలిద్దామా?

  • BRS చేసే తప్పుడు ప్రచారాన్ని తాము తిప్పికొడుతున్నాం

  • భూభారతి డిజిటలైజేషన్‌ గతంలోనే జరిగింది

  • ఆ భూ వివరాలు ధరణిలో పెట్టాలి.. కానీ మాయం చేశారు

  • ధరణితో కేసీఆర్‌ లక్షల కోట్ల లబ్ధి చేకూరింది

  • 10వేల ఎకరాలకు పైగా లెక్కలు మార్చేశారు కేసీఆర్‌

  • రింగ్‌ రోడ్డు లీజు అప్పనంగా అప్పగించేశారు

  • హైదరాబాద్‌, రంగారెడ్డి పరిధిలో అవకతవకలు జరిగాయి

  • కేసీఆర్‌ అఫిడవిట్‌లోనే తప్పులు ఉన్నాయి

  • ఆస్తులు ఎక్కువ ఉన్నా తక్కువ చూపించారు

Revanth-Reddy-1.jpg

08:25 PM : అవును.. నేనింతే..!!

  • ప్రజల మాటలను కాదు.. నిజాయితీని నమ్ముతారు

  • నిజాయితీ అయినా.. రాజకీయ కమిట్‌మెంట్ అయినా ఉండాలి

  • కేసీఆర్‌ను ఓడించాలని నాకు మొదటినుంచి ఉంది

  • నాకు మళ్లీ ఇలాంటి అవకాశం రాదు

  • కష్టపడితే ఫలితం ఉంటుందని నమ్ముతాను

  • కర్ణాటకలో 6 గ్యారంటీలు అమలువుతున్నాయి

  • ఉచిత కరెంట్‌ అనేది కాంగ్రెస్‌ పార్టీ పేటెంట్‌

  • 2004లో కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్‌ ఇచ్చింది

    Revanath-0.jpg

08:20 PM : కామారెడ్డిలో పోటీ ఎందుకంటే..?

  • కామారెడ్దిలో పోటీచేయడం నా వ్యక్తిగత కాదు

  • పార్టీ ఆదేశాలతోనే కామారెడ్డిలో పోటీ

  • కేసీఆర్ అహంకారాన్ని ప్రజలు భరించలేని స్థితిలో ఉన్నారు

  • ఆకలిని భరిస్తారు కానీ, అహంకారాన్ని భరించలేరు

  • కేసీఆర్‌ను ఓడించి ఆ అహంకారాన్ని దించుతాను

  • అన్నీ ఇచ్చానంటున్న కేసీఆర్ స్వేచ్ఛను మాత్రం ఇవ్వలేదు

  • వీటన్నింటిపై తెలంగాణ సమాజంలో చర్చ జరిగేందుకే పోటీ

  • ఓటమి గెలుపులు అనేవి సర్వసాధారణం

  • ఎన్టీఆర్‌ కూడా ఓడిపోయారు కదా?

  • ఎన్టీఆర్‌, ఇందిరాగాంధీ కంటే కేసీఆర్‌ బలవంతుడు కాదు

kcr-kamareddy.jpg

08:15PM : కాంగ్రెస్ మారింది..!!

  • కాంగ్రెస్ పార్టీ గతంలో లాగా కాదు.. ఇప్పుడు ఉన్న కాంగ్రెస్‌ 2.0

  • ఇప్పుడున్న రాజకీయం దొరికితే వేటాడమే

  • ఎంపీగా పోటీచేయాలని తాను అనుకోలేదు

  • అదే విషయాన్ని పార్టీ అధిష్ఠానానికి చెప్పాను

  • ఖమ్మం సీటు ఇస్తే పోటీచేస్తానని చెప్పాను

  • రాహుల్ చెబితేనే మల్కాజిగిరి నుంచి పోటీకి దిగా

  • దేశంలో అతిపెద్ద లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీచేశా

  • అసెంబ్లీ ఎన్నికల్లో అన్యాయం జరిగిందని..

  • పార్లమెంట్‌కు పోటీచేయించింది కాంగ్రెస్‌

congress.jpg

08:10 PM : నాకెవరు చెప్పలేదు..!

  • సీఎం ఎవరు అనేది అధిష్టానం నాకు చెప్పలేదు

  • నాకు సమాచారం వచ్చినా మీకు చెబుతానా?

  • నాతో ప్రయాణం చేసిన చాలామందికి టికెట్లు రాలేదు

  • టికెట్ల విషయంలో పార్టీ ఆదేశించిందే నేను పాటించా

  • నా వాళ్లకే టికెట్లు రావాలని నేను కోరుకోలేదు

  • రెబల్స్‌గా పోటీచేసిన వాళ్లు కూడా ఉపసంహరించుకున్నారు

  • నేతలందరికీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని నమ్మకం వచ్చింది

  • కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందనే వారికి నమ్మకం ఉంది

  • కాంగ్రెస్‌లో 85 మంది సీఎంలు కావాలని కోరుకోవొచ్చు

  • అలా అయినా కాంగ్రెస్‌లో 85 మంది గెలుస్తారు

  • ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడంలో తప్పు లేదు

Revanth.jpg

08:00 PM : అధికారంలోకి రాకపోతే..?

  • అధికారం వచ్చినా.. రాకపోయినా రాజకీయమే చేస్తా

  • 20 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్న.. ఇంకో 20 ఏళ్లైనా ప్రజల కోసం పోరాడుతా

  • ఎవరికీ భయపడను.. వెనకడుగు వేయను

  • కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. కేసీఆరే కాదు ఎవరిపైనా కూడా ప్రతీకారం తీర్చుకోను

  • ప్రజలు ఇచ్చిన అధికారాన్ని కాంగ్రెస్‌ పార్టీ సద్వినియోగం చేసుకుంటుంది

  • అవినీతి, అక్రమాలపై చట్టపరంగానే చర్యలు

  • వ్యక్తిగత కక్షలతో అక్రమంగా అరెస్ట్‌లు చేయడం లాంటివి ఉండవు

  • అధికారంలోకి వస్తే ఏం చర్యలు తీసుకోవాలి

  • ఎలా ముందుకు పోవాలనే దానిపై కలిసే నిర్ణయం

07:55 PM : అవును కీలుబొమ్మలే..!

  • MIM పార్టీ వ్యవహారశైలి అనుమానాస్పదంగా ఉంది

  • అమిత్‌షా చేతిలో అసదుద్దీన్‌ కీలుబొమ్మలా మారారు

  • బీజేపీని అధికారంలో ఉంచడం.. తీసుకురావడమే లక్ష్యంగా MIM పనిచేస్తోంది

  • కాంగ్రెస్‌ అనుకూలమైన వాతావరణం రాష్ట్రంలో ఉంది

  • నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు.. అందుకే RSS అని ముద్రవేస్తున్నారు

  • కేటీఆర్‌కు అహంకారం, బలుపు పెరిగింది

  • కేసీఆర్ కుటుంబంలోని నలుగురికి నేను సమాధానం చెప్పాల్సి వస్తోంది

  • అందుకే వారికి అర్థమయ్యే భాషలో మాట్లాడుతున్నాను

  • నా మీద మొత్తం 89 కేసులు పెట్టారు

  • నాపై ఉన్న కేసులను మెడల్స్‌లాగా ఫీల్ అయ్యా

07:50 PM : ఇంత దారుణమా..?

  • తెలంగాణ వచ్చాక ఇంత దారుణంగా పరిస్థితులు ఉంటాయనుకోలేదు

  • త్వరలోనే తెలంగాణకు విముక్తి కలుగుతుంది

  • లక్ష్యం చేరుకునేందుకు అడుగు దూరంలో ఉన్నాం

  • అతి తక్కువ సమయంలో ఊహించని విధంగా బాధ్యతలు వచ్చాయి

  • నాకు తిరుగులేదు అనుకుంటున్న కేసీఆర్‌తో పోరాడే అవకాశం వచ్చింది

  • బీజేపీ ముఖ్యనేతలు, కిషన్ రెడ్డి, డీకే అరుణ, లక్ష్మణ్‌లు పోటీనుంచి తప్పుకున్నారు

  • బీజేపీ నామమాత్రమైన పోటీలో ఉంది.. అందుకే ముఖ్యనేతలు పోటీలో లేరు

  • BRSకు లబ్ధిచేకూర్చే విధంగా బీజేపీ ప్రయత్నిస్తోంది

Revanth-Reddy.jpg

07:45 PM : నేనే సీఎం అయితే..?

ఆర్కే : రేపు కాలం కలిసొచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్‌పైన ప్రతీకారం తీర్చుకుంటారా..?

రేవంత్ రెడ్డి : లేదు.. అస్సలు లేదు.. చాలా మంది నా విధానాన్ని చూసి ఇలానే అనుకుంటున్నారు. కానీ అది కానేకాదు. ప్రజలు అధికారం ఇచ్చేది వ్యక్తిగత పగ, కోపాన్ని కక్షలు సాధించుకోవడానికి కాదు.. దొరికాడురా అని ఇక పగ తీర్చుకోవాలని అస్సలు కానే కాదు. ప్రజలు ఎన్నో ఆశలు, నమ్మకాన్ని పెట్టుకుని అధికారం ఇస్తారు. ఒక వ్యక్తి ఏదో అలా చేశాడని నేను కూడా అలా చేస్తానని అనుకోవడం అస్సలు తప్పు.. నేను చేయనంటే చేయను.

kcr-bodhan.jpg

07:25 PM : నన్నెవడూ భయపెట్టలేడు :-

  • రాజకీయాల్లో నన్నెవడూ భయపెట్టలేడు

  • జీవితం ఎటు తీసుకెళ్తే అటు వెళ్తాను

  • 20 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నాను.. ఇంకో 20 ఏళ్లు అయినా వయసు ఉంది.. నిల్చోని కొట్లాడుతా

  • మర్యాదకు మర్యాద ఇస్తాను.. నాలుగు అడుగులు వేస్తే నేనూ అలానే ఉంటాను

  • గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చాను.. మధ్య తరగతి నుంచి నేను వచ్చాను

  • సమాజం అంటే నాకు భయం ఉంది

07:15 PM : కేటీఆర్ ఓ బచ్చా!

  • నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కేటీఆర్ నిక్కర్లు వేసుకునేవాడు

  • నన్ను కేటీఆర్ అంటే.. నేను వాళ్ల నాయన కేసీఆర్‌ను అంటాను

  • కేటీఆర్ నన్ను వాడు, వీడు.. ఇష్టానుసారం అనొచ్చా..?

  • కేటీఆర్‌తో 2018-2023 వరకూ ఎక్కడా కలవలేదు

  • జైపాల్ రెడ్డి, జానారెడ్డిని కూడా నోటికొచ్చినట్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి

  • కనీసం ఇలా మాట్లాడకూడదని.. కేటీఆర్‌కు కేసీఆర్ ఎందుకు చెప్పట్లేదు..?

  • వాళ్లు (కేసీఆర్, కేటీఆర్, హరీష్, కవిత) ఏవిధంగా మాట్లాడుతున్నారో.. ఏవిధంగా ఉన్నారో నేను అదే విధంగా రివర్స్ అవుతున్నాను

  • వాళ్లందరికీ నేను ఒక్కడినే ఎదురెళ్తున్నాను

  • నా మీద ఇప్పటి వరకూ నమోదైన చిల్లర కేసులో చాలా వరకు కొట్టేశారు.. ప్రస్తుతం 87 కేసులు ఉన్నాయి

  • కేసులను నేను మెడల్స్‌లాగా ఫీలవుతున్నాను

  • డ్రోన్ ఎగరేసినందుకు నా మీద కేసు పెట్టి జైల్లో పెట్టారు..

  • నా మీద ఉన్న కేసులే నాయొక్క పనితనానికి ఆధారం

Revanth-And-MD.jpg

07:08 PM : వన్ అండ్ ఓన్లీ :-

  • బీఆర్ఎస్‌తో స్ట్రైట్ ఫైట్ చేస్తున్నాం

  • బీజేపీ అనేది ఉందంటే ఉంది..

  • బీజేపీ నామమాత్రంగానే పోటీచేస్తోంది..

  • 2019లో లాగానే.. 2023లో కూడా బీజేపీ ప్రేక్షకపాత్ర పోషిస్తోంది

  • బీఆర్ఎస్‌కు లాభం చేకూర్చేందుకే బీజేపీ ఇలా చేస్తోంది

Revanth-Big.jpg

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Polls) పోలింగ్‌కు సమయం దగ్గరపడుతుండటంతో రాజకీయ పార్టీలు (Political Parties) ఒక్కో అస్త్రం బయటికి తీస్తున్నాయి. ఓ వైపు ఎన్నికల ప్రచారం హోరెత్తిస్తుండగా.. మరోవైపు బహిరంగ సభల్లో నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. 80 సీట్లకుపైగానే బీఆర్ఎస్‌కు (BRS) వస్తాయని పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేస్తుండగా.. సమస్యే లేదు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రి కానివ్వమని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు చెబుతున్నాయి. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణకు ప్రమాదమని కేసీఆర్ చెబుతుండగా.. పదేళ్లలో ఆయన చేసినదేంటి..? అని రేవంత్ కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. అంతేకాదు.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్, కేటీఆర్, హరీష్‌ల కరెంట్ తీస్తానని టీపీసీసీ చీఫ్ చెబుతున్నారు. కచ్చితంగా అధికారంలోకి వచ్చేస్తామని.. ఇక ప్రమాణ స్వీకారమే ఆలస్యమని చెబుతున్న టీపీసీసీ చీఫ్ రేవంత్‌తో.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణతో ప్రత్యేక డిబేట్.. లైవ్‌లో చూడండి..


మరిన్ని తెలంగాణ ఎన్నికల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2023-11-16T21:21:20+05:30 IST