Home » Road Accident
సంగారెడ్డి జిల్లా: పఠాన్ చెరు మండలం, ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్డుపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుకనుంచి కారు ఢీ కొట్టింది. దీంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి..మంటల్లో కారు పూర్తిగా దగ్దమైంది. వివరాల్లోకి వెళితే..
నెల్లూరు జిల్లా: కావలి రూరల్ మండలం, ముసునూరు టోల్ ప్లాజా దగ్గర బుధవారం తెల్లవారు జామున రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఓవర్ టేక్ చేయబోయి. వెనుక నుంచి కారు ఢీ కొంది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
డ్రైవరన్నా.. మీకిది తగునా.. మీ చిన్న పొరపాటు.. కోటి ఆశలతో రెక్కలు విప్పుతున్న మా జంటను బలితీసుకుందన్నా.. పెళ్లై రెండేళ్లే అయ్యిందన్నా.. ఉద్యోగాలు చేస్తూ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి.. పుట్టబోయే పిల్లల కోసం.. అందమైన జీవితం కోసం ఎన్నెన్నో కలలు కన్నాం.. భవిష్యత్ కోసం మరెన్నో ప్రణాళికలు రచించాం.. అవన్నీ క్షణాల్లో గాల్లో కలిసిపోయాయి కదన్నా..
హైదరాబాద్ నుంచి అమలాపురం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు మునగాల వద్ద పెనుప్రమాదం తప్పింది. కన్ను మూసి తెరిచే లోపు బస్సు అదుపు తప్పి రహదారి పక్క ఇంటి ఆవరణలోకి దూసుకెళ్ళింది. హైద్రాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై సడన్గా గేదెలు రావడంతో ప్రమాదం చోటు చేసుకుంది. అయితే డ్రైవర్ అప్రమత్తంగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది.
Telangana: జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కొడుకును అన్యాయంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారంటూ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపిస్తున్నారు. అసలు ఈ కేసులో తన కుమారుడి ప్రమేయమే లేదని చెప్పుకొచ్చారు. ఈ ప్రమాదంపై సీబీఐ లేదా.. సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. కావాలనే వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కుట్ర చేస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే.
అనంతపురంలో(Ananthapuram) సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. మద్యం మత్తులో ఉన్న ఓ డ్రైవర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొని.. దానిపై ఉన్న వ్యక్తిని 18 కి.మీ.లు కారుతోసహా లాక్కెళ్లిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
దుండిగల్ ఓఆర్ఆర్ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. టెక్ మహేంద్ర యూనివర్సిటీకి చెందిన విద్యార్థి ఈ ప్రమాదంలో మృతి చెందాడు. మరో ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. నలుగురు విద్యార్థులు కలిసి నిస్సాన్ కారులో వెళుతూ జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఢీకొట్టారు.
రాజస్థాన్ లోని చురు-సాలాసర్ హైవేపై ఆదివారంనాడు మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు ఒక ట్రక్కును వెనుకవైపు నుంచి ఢీకొనడంతో రెండు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి. దీంతో కారులోని ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనమయ్యారు.
పండుగ పూట సౌదీలోని దమ్మాంలో ఒక తెలుగు ప్రవాసీ కుటుంబంలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తోడుకొడళ్ళు మరణించగా మరికొందరు గాయపడ్డారు.
హైదరాబాద్: రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వస్తు్న్న కారు హిమాయత్ సాగర్ వద్ద డివైడర్ను ఢీ కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.