Home » Sabitha Indra Reddy
పొరపాటున మాట్లాడిన మాటలపై కేటీఆర్ హుందాగా క్షమాపణ చెప్పినా... కొందరు కాంగ్రెస్ మహిళా నేతలు ఇంకా విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై బీఆర్ఎస్ మహిళా నేతలు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. కేటీఆర్, హరిష్ రావులు టార్గెట్గా కాంగ్రెస్ చేస్తున్న కామెంట్స్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం నాడు ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునితా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ వాని దేవి ప్రెస్మీట్లో ..
వైరాలో నిర్వహించిన మూడో విడత రైతు రుణ మాఫీ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రి హరీశ్ రావుపై సీఎం చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా పలువురు ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.2లక్షల రుణమాఫీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా, నయవంచన చేసిందంటూ మండిపడ్డారు.
దొంగతనం ఆరోపణతో దళిత మహిళను చిత్రహింసలకు గురి చేసిన ఘటనలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ సహా ఆరుగురిని సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మొహంతి ఉత్తర్వులు జారీ చేశారు.
అసెంబ్లీలో తమను సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా విమర్శించారని, మహిళల పట్ల ఆయన తీరు సరికాదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు.
‘అక్కా..! మా పార్టీలోకి రండి.. సీఎం చేస్తం..’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి ఆహ్వానం పలికారు.
‘ఏడుపు ఎందుకు సబితమ్మా? చేవెళ్ల చెల్లమ్మా అని కాంగ్రెస్ పార్టీ ఆదరించినందుకా?’ అంటూ ఆ పార్టీ బుధవారం అసెంబ్లీలో జరిగిన సంఘటనపై ‘ఎక్స్’ వేదికగా ప్రశ్నించింది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీలో తనపై అవమానకరంగా మాట్లాడారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కంటతడి పెట్టారు.
అసెంబ్లీలో తన తల్లి సబితా ఇంద్రారెడ్డికి జరిగిన అవమానంపై పట్లొల్ల కార్తీక్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. అన్నా అనుకుంటూనే సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. ఎవరిది మోసం? ఎవరు బాధపడ్డారంటూ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ వేదికగా ప్రశ్నలు సంధించారు. అండగా ఉంటానని చెప్పి తనను మోసం చేశారని..
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తున్న ఆ పార్టీ నేతలు గురువారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు సిద్ధమయ్యారు.