MLA: నమ్మించి మోసం చేశారు.. తులం బంగారం వెంటనే ఇవ్వాలి
ABN , Publish Date - Nov 07 , 2024 | 11:05 AM
వంద రోజుల్లో హామీలు అమలు చేస్తానని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ప్రజలను నమ్మించి మోసం చేశాడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి(Former Minister, MLA Sabitha Reddy) ఆరోపించారు.
హైదరాబాద్: వంద రోజుల్లో హామీలు అమలు చేస్తానని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ప్రజలను నమ్మించి మోసం చేశాడని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి(Former Minister, MLA Sabitha Reddy) ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు ఇస్తానన్న లక్ష రూపాయలతో పాటు తులం బంగారం వెంటనే ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. సరూర్‌నగర్(Sarurnagar) మండలం పరిధిలోని కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు బుధవారం మండల కార్యాలయం ఆవరణలో జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్ రాధాధీరజ్‌రెడ్డితో కలిసి చెక్కులను అందజేశారు.
ఈ వార్తను కూడా చదవండి: R. Krishnaiah: అన్ని పార్టీలూ ఎమ్మెల్సీ టికెట్లు బీసీలకే కేటాయించాలి
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి 11 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు. అనంతరం సరూర్‌నగర్ కళాశాల నూతన భవనాన్ని ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వేణుగోపాల్, నాయబ్ తహసీల్దార్ జంగయ్య, బీఆర్‌ఎస్ మహేశ్వరం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మురుకుంట్ల అరవింద్‌శర్మ, ఆర్‌కేపురం డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్, లోకసాని కొండల్‌రెడ్డి, న్యాలకొండ శ్రీనివా్‌సరెడ్డి, రాంనర్సింహగౌడ్, సాజిద్, పెంబర్తి శ్రీనివా్‌సరావు, కంచర్ల శేఖర్, రుషి పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: యాదగిరిగుట్ట ఆలయంలో కుంగిన ఫ్లోరింగ్!
ఈవార్తను కూడా చదవండి: కేశవాపురం వద్దు.. మేఘా కాంట్రాక్టు రద్దు
ఈవార్తను కూడా చదవండి: అరుణాచల ప్రదక్షిణకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
ఈవార్తను కూడా చదవండి: తీన్మార్ మల్లన్నకు స్ట్రాంగ్ వార్నింగ్
Read Latest Telangana News and National News