Home » Samineni Udaya Bhanu
Samineni Udaya bhanu: చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు ఒకే ఆలోచనతో ప్రజలకు మంచి చేయాలని ముందుకు సాగుతున్నారని జనసేన నేత సామినేని ఉదయభాను అన్నారు. తన మీద పవన్ కల్యాణ్ పెట్టిన నమ్మకం నిలబెట్టేలా పని చేస్తానని చెప్పారు. కూటమి పార్టీల నేతల మధ్య ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు లేవని తెలిపారు.
మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి నాయకులను స్వాగతం పలికారు. ఈ ముగ్గురితో పాటు వైసీపీ కీలక నాయకులు జనసేన పార్టీలో చేరారు. విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు..
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన సన్నిహితులు గట్టి షాకే ఇచ్చారు. మాజీ మంత్రి, ఆయన సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి, అత్యంత ఆత్మీయుడిగా మెలిగిన జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి గుడ్‌బై చెప్పారు.
జనసేన కార్యాలయంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు ఇరువురు నేతల మధ్య చర్చ జరిగింది. ఈనెల 22న జనసేనలో చేరుతున్నట్లు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఉదయభాను ప్రకటించారు.
YSRCP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఎంతో మంది ముఖ్య నేతలు వైసీపీని వీడగా.. ఇప్పటికీ ఆ పరంపర కొనసాగుతోంది. బుధవారమే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వైసీపీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి రాత్రింబవళ్లు ఆలోచిస్తునే ఉన్నా.. నిద్ర పట్టడంలేదు.. ఇంత ఘోర ఓటమి ఎలా పొందాం.. పేటలో పక్కా వార్డులలో పత్తా లేకుండా పోయాం..
వైసీపీ మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను నేడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇకపై తమ పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులు ఆపకపోతే ప్రతి దారుడు చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. మూడు పార్టీల కలయిక వల్లే ఎన్డీఏ కూటమి విజయం సాధించిందని జగ్గయ్యపేటలో మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను పేర్కొన్నారు. మాకు ప్రజలు 40 శాతం మద్దతు తెలిపారన్నారు.
జగ్గయ్యపేట చరిత్రలో మునిసిపల్ చైర్మన్లుగా పనిచేసిన వారికి రాజకీయ భవిష్యత్ మృగ్యం అన్న అపవాదు, సెంటిమెంట్‌ను తాతయ్య తుడిచేశారు. జగ్గయ్యపేట పురపాలక సంఘంగా ఏర్పడినప్పడి నుంచి పనిచేసిన చైర్మన్లు ఎవరు తర్వాత రాజకీయాల్లో రాణించలేదు...