AP Politics: పవన్ సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ కీలక నేతలు..
ABN , Publish Date - Sep 26 , 2024 | 06:12 PM
మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి నాయకులను స్వాగతం పలికారు. ఈ ముగ్గురితో పాటు వైసీపీ కీలక నాయకులు జనసేన పార్టీలో చేరారు. విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు..
వైసీపీకి భారీ షాక్ తగిలింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సహా మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య జనసేనలో చేరారు. మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి నాయకులను స్వాగతం పలికారు. ఈ ముగ్గురితో పాటు వైసీపీ కీలక నాయకులు జనసేన పార్టీలో చేరారు. విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు అవనపు విక్రమ్, అవనపు భావన, ప్రకాశం జిల్లాకు చెందిన యాదాల అశోక్ బాబు, నాగులుప్పలపాడు జడ్పీటీసీ యాదాల రత్నభారతి పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. కీలక నేతలు ఒకేసారి జనసేనలో చేరడంతో ఆ పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న వేళ.. కీలక నాయకులంతా వైసీపీని వీడి ఇతర పార్టీల్లో చేరుతున్నారు. ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి, కిలారు రోశయ్య, సామినేని ఉదయభాను వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారు. బాలినేని మంత్రిగానూ పనిచేశారు. వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డితో బాలినేనికి బంధుత్వం ఉంది. అయినప్పటికీ వైసీపీ అధ్యక్షుడి తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బాలినేని ఆ పార్టీని కాదని జనసేనలో చేరినట్లు తెలుస్తోంది.
Madhavilatha: శ్రీవారికి జరిగిన అపచారానికి ప్రాయశ్చిత్తంగా మాధవీలత ఏం చేశారంటే..
వైసీపీకి వరుస షాక్‌లు..
బాలినేని, కిలారు, సామినేని బాటలోనే మరికొందరు నాయకులు పయనించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో వారం రోజుల్లో కీలక నేతలు జగన్‌కు గుడ్‌బై చెప్పి జనసేనలో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజీనామా చేసిన నాయకులు సైతం టీడీపీ, జనసేనలో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. పార్టీని వీడుతున్న వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఫలితం లేనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జగన్ వైఖరి నచ్చకపోవడంతోనే వీళ్లంతా పార్టీని వీడుతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. కీలక నాయకులు పార్టీని వీడటంతో క్షేత్రస్థాయిలో కేడర్ సైతం జనసేనలోకి వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా కీలక నేతల అనుచరులు మొదట పార్టీలో చేరుతుండగా.. దశలవారీ ద్వితీయ శ్రేణి నాయకులను పార్టీలోకి తీసుకురానున్నట్లు చర్చ జరుగుతోంది.
Kollu Ravindra: నోటికొచ్చినట్లు వాగితే.. పళ్లురాలిపోతాయ్.. జాగ్రత్త అంటూ పేర్నినానిపై ఫైర్
సందడి వాతావరణం..
జనసేనలో వైసీపీ కీలక నాయకుల చేరిక నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. బాలినేని శ్రీనివాస రెడ్డి, సామినేని ఉదయభాను, కిలారు రోశయ్యతో పాటు వారి అనుచరులు భారీ సంఖ్యలో పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ కార్యాలయం నిర్మాణ పనుల కారణంగా ఒక్కో నాయకుడి వెంట లోపలకు నలుగురిని మాత్రమే అనుమతించారు. భారీగా కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చిన తరుణంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
AP Govt: సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి షోకాజ్ నోటీస్
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Latest Telugu News Click Here