Home » Sangareddy
Telangana: సిద్దిపేటలో రాజకీయ సమావేశంలో పాల్గొన్నారంటూ ఉద్యోగులను సస్పెండ్ చేసిన అంశంపై ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ అధ్యక్షులు దేవీప్రసాద్ స్పందించారు. ఉద్యోగుల సస్పెన్షన్‌ను తీవ్రంగా ఖండించారు. రాజకీయ సమావేశంలో పాల్గొన్నారన్న నెపంతో 106 చిన్న తరగతి ఉద్యోగులను సస్పెండ్ చేయడం సరికాదన్నారు. తమ సమస్యలపై చర్చించుకోవడానికి ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న సమావేశానికి బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రాంరెడ్డి వెళ్లి ఎన్నికల్లో ఓట్ చేయాలని కోరారని వివరించారు.
సంగారెడ్డి జిల్లా: పెండ్లి బట్టలు కొనేందుకు వచ్చిన ఓ యువతి అదృశ్యమైంది. సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్‌కు చెందిన మౌనిక (20) అనే యువతికి ఈ నెల 15వ తేదీన వివాహం చేసేందుకు కుటుంబ పెద్దలు నిర్ణయించారు.
కాంగ్రెస్ పార్టీకి అవమానం తక్కువ, రాజపూజ్యం ఎక్కువ అని ఆ పార్టీ నేత జగ్గారెడ్డి అన్నారు. మంగళవారం ఉగాది పర్వదినం నేపథ్యంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పార్టీకి రాజ పూజ్యం 16 ఉంటే.. అవమానం 2 ఉందని చెప్పారు. తాను పీసీసీ అధ్యక్ష పదవి అడగడం కొత్తేమి కాదన్నారు. అయితే అవకాశం వచ్చిన ప్రతీ సారి తాను పీసీసీ పీఠం అడుగుతానని ఈ సందర్బంగా ఆయన స్పష్టం చేశారు.
సంగారెడ్డి జిల్లా: కొల్లూర్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. 10.5 లక్షల విలువ చేసే 32 కేజీల గంజాయిను మాదాపూర్ ఎస్వోటీ పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. దీనికి సంబంధించి సంగారెడ్డి జిల్లాకు చెందిన బానోత్ లక్ష్మన్ అనే యువకుడిని అరెస్టు చేశారు.
సంగారెడ్డి నియోజకవర్గంలో రాజకీయ కొట్లాటలు ఉండొద్దని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు. శుక్రవారం నాడు కాంగ్రెస్ కార్యాలయంలో కొండాపూర్ మండలం మల్కాపుర్‌లోని వెంకటేశ్వర గార్డెన్లో కాంగ్రెస్ (Congress) కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు.
Telangana: అవసరాలకు అప్పులు తీసుకుని వాటిని తీర్చే మార్గం లేక చివరకు ప్రాణాలు కూడా తీసుకుంటున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. ముఖ్యంగా లోన్ యాప్ సంస్థల వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. లోన్ యాప్‌ల ద్వారా రుణాలు పొంది.. సరైన సమయానికి ఈఎంఐలు కట్టలేకపోతుంటారు కొందరు. అప్పు కట్టాల్సిందే అంటూ లోన్ యాప్ నిర్వాహకులు అనేక విధాలుగా వేధింపులకు గురిచేస్తుంటారు.
Telangana: జిల్లాలోని హత్నూర మండలం చందాపూర్ కెమికల్ ఫ్యాక్టరీలో గాయపడి సంగారెడ్డి ఎంఎన్ఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను మాజీ మంత్రి హరీష్‌రావు పరామర్శించారు. ఈ ఘటనకు సంబంధించి కలెక్టర్ వల్లూరు క్రాంతితో హరీష్‌రావు ఫోన్లో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రమాదం దురదృష్టకరమన్నారు. బాధితులను ఆదుకోవడంలో యాజమాన్యం, ప్రభుత్వం విఫలం అయ్యాయని విమర్శించారు.
సంగారెడ్డి జిల్లా హత్నుర మండలంలోని కెమికల్ పరిశ్రమలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే ఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఫైర్ సర్వీసెస్ డి.జి. నాగిరెడ్డి ని ఆదేశించారు.
సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హత్నూర మండలం చందాపూర్ వద్ద ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ఈరోజు( బుధవారం) రియాక్టర్ పేలి మంటలు భారీగా వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదంలో పరిశ్రమ డైరెక్టర్ రవితో పాటు మరో ఏడుగురు కార్మికులు మృతి చెందారు.
సంగారెడ్డి జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెళ్లి కూతుర్ని తీసుకెళ్లేందుకు ట్రాక్టర్‌పై వెళ్లిన ఓ బృందం కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిలింది. ట్రాక్టర్ బోల్తా పడటంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. 20 మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది.