Share News

Loan Apps: అయ్యో.. లోన్ యాప్ ఎంత పనిచేసింది!

ABN , Publish Date - Apr 05 , 2024 | 11:08 AM

Telangana: అవసరాలకు అప్పులు తీసుకుని వాటిని తీర్చే మార్గం లేక చివరకు ప్రాణాలు కూడా తీసుకుంటున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. ముఖ్యంగా లోన్ యాప్ సంస్థల వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. లోన్‌ యాప్‌ల ద్వారా రుణాలు పొంది.. సరైన సమయానికి ఈఎంఐలు కట్టలేకపోతుంటారు కొందరు. అప్పు కట్టాల్సిందే అంటూ లోన్ యాప్ నిర్వాహకులు అనేక విధాలుగా వేధింపులకు గురిచేస్తుంటారు.

Loan Apps: అయ్యో.. లోన్ యాప్ ఎంత పనిచేసింది!

సంగారెడ్డి, ఏప్రిల్ 5: అవసరాలకు అప్పులు తీసుకుని వాటిని తీర్చే మార్గం లేక చివరకు ప్రాణాలు కూడా తీసుకుంటున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. ముఖ్యంగా లోన్ యాప్ (Loan Apps) సంస్థల వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. లోన్‌ యాప్‌ల ద్వారా రుణాలు పొంది.. సరైన సమయానికి ఈఎంఐలు కట్టలేకపోతుంటారు కొందరు. అప్పు కట్టాల్సిందే అంటూ లోన్ యాప్ నిర్వాహకులు అనేక విధాలుగా వేధింపులకు గురిచేస్తుంటారు. తీసుకున్న మొత్తానికి అప్పు కట్టినప్పటికే అదనంగా చెల్లించాలంటూ ఇంకో రకంగా ఇబ్బందులకు గురిచేస్తుంటారు. లోన్ తీసుకున్న వారి ఫోటోలను సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు దిగుతుంటారు. అయినప్పటికీ అప్పులు చెల్లించని పక్షంలో దయాదాక్షిన్యాలు మరిచి... లోన్ తీసుకున్న వారి ఫోటోలను అసభ్యకర రీతితో సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ లోన్‌యాప్ నిర్వాహకులు బరితెగిస్తుంటారు. తాజాగా ఇలాంటి ఘటనలో సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో చోటు చేసుకుంది.

Shanti Swaroop: మూగబోయిన తొలి తెలుగు న్యూస్ రీడర్ స్వరం..


అసలేం జరిగిందంటే...

జిల్లాలోని అందోల్ మండలం కన్సాన్ పల్లి గ్రామానికి చెందిన యువకుడు శ్రీకాంత్ (21) లోన్‌యాప్‌ ద్వారా రూ.30 వేల రేణం తీసుకున్నాడు. రూ.30 వేల రుణానికి గాను.. నాలుగు నెలల వ్యవధిలో శ్రీకాంత్ దాదాపు రూ.1,30,000 చెల్లించాడు. అయితే ఇంకా అదనంగా మరో రూ.80 వేలు చెల్లించాలంటూ శ్రీకాంత్‌పై లోన్‌యాప్ సిబ్బంది ఒత్తిడి తీసుకొచ్చారు. లోన్ యాప్ సిబ్బందికి డబ్బులు చెల్లించేందుకు యువకుడు నిరాకరించాడు. దీంతో రెచ్చిపోయిన లోన్‌యాప్ సిబ్బంది శ్రీకాంత్ పట్ల దురుసుగా ప్రవర్తించారు. యువకుడిపై సోషల్ మీడియాలో అశ్లీల పోస్టులు పెట్టి మరీ వేధించారు. దాంతో మనస్థాపానికి గురైన శ్రీకాంత్ మార్చి 30న పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబసభ్యులు వెంటనే హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కాగా.. చికిత్స పొందుతూ శ్రీకాంత్ గత రాత్రి కన్నుమూశాడు. శ్రీకాంత్ మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. లోన్‌యాప్ సిబ్బంది ఆగడాలను అరికట్టాలని మృతుని బంధువులు డిమాండ్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

TSRTC: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఆర్టీసీ కీలక నిర్ణయం..

Raghurama Krishnaraju: ఏ పార్టీ సభ్యత్వం తీసుకున్నా.. మరుక్షణమే నా ఎంపీ సీటు పోతుంది


మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 05 , 2024 | 11:13 AM