Home » Sanjay Raut
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారనే ఊహాగానాల నేపథ్యంలో శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం నేత సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నియోజకవర్గమైన వారణాసి నుంచి ఆయనపై ప్రియాంక పోటీ చేస్తే ఆమె గెలుపొందడం ఖాయమని జోస్యం చెప్పారు.
రాహుల్ గాంధీని చూసి కేంద్ర ప్రభుత్వం భయపడుతోందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆదివారంనాడు విమర్శించారు. సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా ప్రకటించిన 24 గంటలు కూడా తిరక్కుండానే లోక్సభ స్పీకర్ ఆయనపై అనర్హత వేటు వేశారని, ఇప్పుడు రాహుల్కు వేసిన శిక్షపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చినప్పటికీ ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరించలేదని ఆక్షేపణ తెలిపారు.
లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఏర్పడిన విపక్ష కూటమి ఇండియా మూడో సమావేశానికి ముంబై ఆతిథ్యం ఇవ్వనుంది. ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో రెండ్రోజుల పాటు జరిగే ఈ సమావేశం తమ పార్టీ ఆధ్వర్యంలో జరుగనున్నట్టు ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు.
శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం నేత, ఆ పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ బంగ్లాలో ఒక పాము (Snake) బుధవారం ఉదయం హల్చల్ చేసింది. ఆ సమయంలో ఆయన ప్రెస్ మీట్లో ఉన్నారు. పాముల పట్టే యువకుడిని సకాలంలో అక్కడకు రప్పించడంతో అతను పాము తోకపట్టుకుని తెలివిగా తనవెంట ఉన్న బ్యాగులోకి జారవిడిచి దూరంగా తీసుకువెళ్లిపోయాడు.
శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ థాకరే, ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరేలు సోదరులని, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కలుసుకుంటారని, వారికి మధ్యవర్తిత్వ చేయాల్సిన అవసరం లేదని ఉద్ధవ్ వర్గం నేత సంజయ్ రౌత్ అన్నారు.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు త్వరలోనే ఉద్వాసన పలకడం ఖాయమని శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం నేత సంజయ్ రౌత్ జోస్యం చెప్పారు. ఆదివారంనాడు శివసేన-బీజేపీ కూటమిలో చేరిన అజిత్ పవార్ సీఎం స్థానంలోకి వస్తారని అన్నారు.
శివసేన నేత సంజయ్ రౌత్ ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు. జూన్ 20వ తేదీని ''ప్రపంచ విద్రోహుల దినం''గా ప్రకటించాలని ఐరాసను కోరారు. మహారాష్ట్రలో 2022 జూన్లో ఉద్ధవ్ థాకరే సారథ్యంలోని శివసేనలో రాజకీయ కల్లోలం చెలరేగిన నేపథ్యంలో రౌత్ ఈ విజ్ఞప్తి చేశారు.
మహారాష్ట్రలోని కొల్హాపూర్లో హింసాకాండ నేపథ్యంలో శివసేన (యూబీటీ) నేత, ఎంపీ సంజయ్ రౌత్సం చలన వ్యాఖ్యలు చేశారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ప్రభంజనం ముగిసిందని, ప్రతిపక్షాల ప్రభంజనం వస్తోందని శివసేన (యూబీటీ)
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలు రసవత్తంగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నేత నితీష్ రాణె ఎన్సీపీలో చోటుచేసుకోనున్న పరిణామాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీతో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేతులు కలుపబోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.