Share News

Loksabha Elections: 35 ఎంపీ స్థానాలు గెలుస్తాం: సంజయ్ రౌత్

ABN , Publish Date - Apr 28 , 2024 | 02:53 PM

ఈ లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ 30 నుంచి 35 స్థానాలను కైవసం చేసుకుంటుందని శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రతిష్ట కోసం భారమతి నుంచి పోరాటం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం పుణేలో సంజయ్ రౌత్ విలేకర్లతో మాట్లాడారు.

Loksabha Elections: 35 ఎంపీ స్థానాలు గెలుస్తాం: సంజయ్ రౌత్

పుణే, ఏప్రిల్ 28: ఈ లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ 30 నుంచి 35 స్థానాలను కైవసం చేసుకుంటుందని శివసేన (యూబీటీ) నాయకుడు సంజయ్ రౌత్ ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రతిష్ట కోసం భారమతి నుంచి పోరాటం జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం పుణేలో సంజయ్ రౌత్ విలేకర్లతో మాట్లాడారు.


మాజీ ముఖ్యమంత్రి, శివసేన యూబీటీ అధినేత ఉద్దవ్ ఠాక్రే.. త్వరలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు. భారమతి లోక్‌సభ పరిధిలోని కడక్‌వాస్లా నుంచి ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభమవుతుందని వివరించారు. మహారాష్ట్ర ప్రజలంతా సుప్రియా సులే వైపు ఉన్నారని ఆయన పునరుద్ఝాటించారు.


బారామతి ఎంపీ అభ్యర్థిగా శరద్ పవర్ కుమార్తె సుప్రీయా సులే బరిలో దిగారు. ఆమె ప్రత్యర్థిగా డిప్యూటీ సీఎం అజిత్ పవర్ భార్య సునేత్ర పవర్ పోటీ చేస్తున్నారు. దీంతో విజయం ఎవరిని వరిస్తుందనే అంశం ఆసక్తిగా మారింది.


ఇప్పటికే బారమతి లోక్‌సభ స్థానం నుంచి సుప్రియా మూడు సార్లు ఎన్నికయ్యారు. నాలుగోసారి ఆమె బరిలో నిలిచారు. మరోవైపు మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ కూటమిలో ఎన్సీపీ (శరద్ పవర్), కాంగ్రెస్ పార్టీ, శివసేన (యూబీటీ) పార్టీలు ఉన్నాయి.

శరద్ పవర్ సోదరుడే అజిత్ పవర్. ఇక ఈ ఎన్నికల్లో తన భార్య సునేత్ర పవర్ భారీ అధిక్యతతో విజయం సాధిస్తారని డిప్యూటీ సీఎం అజిత్ పవర్ సైతం చెబుతున్నారు. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్ సభ స్థానాలున్నాయి.

Read National News and Telugu News

Updated Date - Apr 28 , 2024 | 02:53 PM