Home » Sankharavam
విజయనగరం జిల్లా: మరో ఐదేళ్లు ఏపీకి హైదరాబాద్ రాజధానిగా ఉండాలని వైసీపీ నేతలు కోరుతున్నారని... అంటే ఏపీకి రాజధాని కట్టలేరని తేలిపోయిందని, ఉన్న రాజధాని చెడగొట్టారని.. ఇప్పుడు హైదరాబాద్ రాజధానిగా కావాలని కోరుతున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. బిల్డప్ బాబాయ్ జగన్కు ‘యాత్ర-2 ’ సినిమా కావాలి కానీ ‘రాజధాని ఫైల్స్’ వద్దంటా...! యాత్ర 2 సినిమా ఇప్పటికే వైసీపీ అంతిమ యాత్రగా మారిందని లోకేష్ అన్నారు.
విజయనగరం: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంఖారావం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం విజయనగరం జిల్లాలో పర్యటించనున్నారు. నెల్లిమర్లలో ఉదయం 10:15 నుంచి 11:30 గంటల వరకు సభలు నిర్వహిస్తారు.
విజయనగరం జిల్లా: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన శంఖారావం కార్యక్రమంలో భాగంగా బుధవారం విజయనగరం జిల్లా పార్వతీపురంలో జరుగుతున్న బహిరంగ సభలో లోకేష్ మాట్లాడుతూ..
25కు 25 మంది ఎంపీలను గెలిపిస్తే హోదా తీసుకువస్తామన్నారని, వైసీపీకి 31 మంది ఎంపీలను ఇస్తే ఏంచేశారని నారా లోకేష్ ప్రశ్నించారు. కేసుల మాఫీ కోసం కేంద్రం ముందు మెడ వంచారని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డికి వైసీపీ ఎంపీలే ముఖం చాటేస్తున్నారని, జగన్ డిల్లీ వెళ్లితే 31మందిలో ఆరుగురు మాత్రమే ఆయన వెంట వెళ్లారని.. వారు బైబై జగన్ అని చెప్పే పరిస్థితి వచ్చిందన్నారు.
శ్రీకాకుళం జిల్లా: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన శంఖారావం సభ సోమవారం ఉదయం నరసన్నపేటలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Lokesh Sankharavam: వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ శ్రీకారం చుట్టిన సరికొత్త కార్యక్రమమే‘శంఖారావం’. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఇచ్ఛాపురంలోని సురంగి రాజా మైదానంలో సభ జరుగుతోంది. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు, సామాన్య ప్రజలతో మైదానం కిక్కిరిసింది. ఒక్క మాటలో చెప్పాలంటే పసుపుదళం అంతా సిక్కోలు గడ్డపై వాలిపోయింది.