Share News

Sankharavam Live: సిక్కోలు గడ్డపై లోకేశ్‌ ‘శంఖారావం’.. తరలివచ్చిన పసుపుదళం

ABN , Publish Date - Feb 11 , 2024 | 11:48 AM

Lokesh Sankharavam: వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ శ్రీకారం చుట్టిన సరికొత్త కార్యక్రమమే‘శంఖారావం’. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఇచ్ఛాపురంలోని సురంగి రాజా మైదానంలో సభ జరుగుతోంది. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు, సామాన్య ప్రజలతో మైదానం కిక్కిరిసింది. ఒక్క మాటలో చెప్పాలంటే పసుపుదళం అంతా సిక్కోలు గడ్డపై వాలిపోయింది.

Sankharavam Live: సిక్కోలు గడ్డపై లోకేశ్‌ ‘శంఖారావం’.. తరలివచ్చిన పసుపుదళం

వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్‌ శ్రీకారం చుట్టిన సరికొత్త కార్యక్రమమే‘శంఖారావం’. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఇచ్ఛాపురంలోని సురంగి రాజా మైదానంలో సభ జరుగుతోంది. వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు, సామాన్య ప్రజలతో మైదానం కిక్కిరిసింది. ఒక్క మాటలో చెప్పాలంటే పసుపుదళం అంతా సిక్కోలు గడ్డపై వాలిపోయింది.


40 రోజులు 120 నియోజకవర్గాలు!

కాగా.. రోజుకు 3 నియోజకవర్గాల చొప్పున అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో లోకేష్ సభలు నిర్వహించనున్నారు. యువగళం పాదయాత్ర ముగించినప్పటికీ.. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని కొన్ని నియోజకవర్గాల్లో లోకేశ్‌ పర్యటించలేదు. ఈ నేపథ్యంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో ఇవాళ్టి నుంచి 40 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా 120 నియోజకవర్గాల్లో ‘శంఖారావం’ పేరుతో సభలు నిర్వహించనున్నారు. ఆలస్యమెందుకు.. ఇచ్చాపురంలో జరుగుతున్న ‘శంఖారావం’ కార్యక్రమాన్ని ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించండి..

Updated Date - Feb 11 , 2024 | 11:48 AM