Home » Satyendar Jain
తన ఇంటి నుంచి రూ.3 కోట్లు, 1.8 కిలోల బంగారం, 133 బంగారు నాణేలు స్వాధీనం చేసుకున్నట్టు స్వరాజ్ తప్పుడు ఆరోపణలు చేశారని జైన్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకు, రాజకీయంగా లబ్ది పొందేందుకు స్వరాజ్ ఈ ఆరోపణలు చేశారని అన్నారు.
మనీ లాండరింగ్ కేసులో బెయిలు మంజూరు కావడంతో ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ శుక్రవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ముఖ్యమంత్రి అతిషి, ఆప్ కీలక నేతలు సంజయ్ సింగ్, మనీష్ సిసోడియా తదితరులు జైలు బయట సత్యేంద్ర జైన్‌కు సాదర స్వాగతం పలికారు.
విచారణలో జాప్యం, ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచిన కారణంగా సత్యేంద్ర జైన్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. విచారణకు తెరపడేటట్టు కనిపించడం లేదని కూడా కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఆప్ నేత, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు మనీలాండరింగ్ కేసులో ఉపశమనం దక్కలేదు. ఆయనపై ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు మంగళవారంనాడు నిరాకరించింది.
సుఖేష్ చంద్రశేఖర్ (Sukhesh Chandra Sekhar).. ఈ పేరు వినిపించినా, మనిషి కనిపించినా.. ఇక లేఖలు బయటికొస్తే అదొక సంచలనమే! అరెస్టయిన నాటి నుంచి ఇప్పటి వరకూ ఎలాంటి విషయాలతో వార్తల్లో నిలిచారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.! మరీ ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కేసులో (Delhi Liquor Case) అరెస్టయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, సత్యేంద్ర జైన్లకు అయితే జైల్లో నుంచే సుఖేష్ చుక్కలు చూపిస్తున్నాడు!.
మనీ లాండరింగ్ కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న 'ఆప్' నేత, రాష్ట్ర మాజీ హోం మంత్రి సత్యేంద్ర జైన్ మరిన్ని చిక్కుల్లో పడ్డారు. తీహార్ జైలులో ఉన్న కాన్మన్ సుఖేష్ చంద్రశేఖర్ (Sukhesh Chandrashekhar) నుంచి రక్షణ సొమ్ముగా ఆయన రూ.10 కోట్లు తీసుకున్నారన్న ఆరోపణలపై అవినీతి నిరోధక (POC) చట్టం కింద సీబీఐ (CBI) విచారణకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (MHA) శుక్రవారంనాడు ఆమోదం తెలిపింది.
ఢిల్లీ మాజీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత సత్యేంద్ర జైన్(Satyendra Jain)కు సుప్రీంకోర్టు (Supreme Court) మధ్యంతర బెయిల్‌ను మరోసారి పొడిగించింది. అక్టోబర్ 9 వరకు బెయిల్ పొడిగింపును మంజూరు చేసింది. మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఆయనకు తొలుత మే 26న మెడికల్ బెయిల్(Bail) మంజూరు చేశారు.
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ బెయిలు కోరుతూ సుప్రీంకోర్టును సోమవారంనాడు ఆశ్రయించారు. మనీ లాండరింగ్ కేసులో జైన్‌ను 2022 మే 31న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది.
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేత, మాజీ మంత్రి సత్యేందర్ జైన్ (Satyender Jain)కు మనీలాండరింగ్ కేసులో బెయిలు మంజూరు చేసేందుకు ఢిల్లీ
మద్యం పాలసీ కుంభకోణం కేసులో అరెస్టయి సీబీఐ కస్టడీలో ఉన్న మనీష్ సిసోడియా, ఇదే కేసులో ఇంతకుముందే జైలుకు వెళ్లిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్..