Satyendra Jain: బీజేపీ ఎంపీపై సత్యేంద్ర జైన్ పరువునష్టం దావా
ABN , Publish Date - Dec 10 , 2024 | 04:32 PM
తన ఇంటి నుంచి రూ.3 కోట్లు, 1.8 కిలోల బంగారం, 133 బంగారు నాణేలు స్వాధీనం చేసుకున్నట్టు స్వరాజ్ తప్పుడు ఆరోపణలు చేశారని జైన్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకు, రాజకీయంగా లబ్ది పొందేందుకు స్వరాజ్ ఈ ఆరోపణలు చేశారని అన్నారు.
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (BJP) ఎంపీ బన్సూరి స్వరాజ్ (Bansuri Swaraj)పై ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత సత్యేంద్ర జైన్ (Satyendra Jain) క్రిమినల్ పరువునష్టం కేసు (Criminal Defamation case) వేశారు. 2023 అక్టోబర్ 5న ఒక టీవీ ఇంటర్వ్యూలో తన పరువుకు నష్టం కలిగించేలా బన్సూరి స్వరాజ్ వ్యాఖ్యలు చేశారని, ఈ ఇంటర్వ్యూను లక్షలాది మంది చూశారని జైన్ ఫిర్యాదు చేశారు. కాగా, ఆయన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకునే విషయాన్ని డిసెంబర్ 16న నిర్ణయిస్తామని అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ నేహా మిట్టల్ ప్రకటించారు.
Arvind Kejriwal: ఆటోడ్రైవర్లకు రూ.10 లక్షల బీమా, పిల్లల పెళ్లిళ్లకు లక్ష సాయం
కాగా, తన ఇంటి నుంచి రూ.3 కోట్లు, 1.8 కిలోల బంగారం, 133 బంగారు నాణేలు స్వాధీనం చేసుకున్నట్టు స్వరాజ్ తప్పుడు ఆరోపణలు చేశారని జైన్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేందుకు, రాజకీయంగా లబ్ది పొందేందుకు స్వరాజ్ ఈ ఆరోపణలు చేశారని అన్నారు. తనను అవినీతిపరుడుగా, మోసగానిగా కూడా ఆమె పేర్కొన్నట్టు తెలిపారు. రాజకీయంగా తనకు ఎలాంటి మచ్చాలేదని, ఇలాంటి తప్పుడు ప్రచారంతో సమాజంలో ఒక వ్యక్తిగా, భర్తగా, తండ్రిగా, సోదరుడిగా, స్నేహితుడిగా తనకున్న ఇమేజ్‌కు భంగం కలిగిందని అన్నారు. ప్రజా ప్రతినిధిగా, వ్యక్తిగతంగా కూడా ఇలాంటి ఆరోపణలతో తన ఇమేజ్ దారుణంగా దెబ్బతింటుందని జైన్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
INDIA Block: మమతకు మద్దతు తెలిపిన మాజీ సీఎం
CM Stalin: సీఎం స్టాలిన్ సంచలన కామెంట్స్.. ఆ ప్రాజెక్టు అమలైతే పదవికి రాజీనామా..
For National News And Telugu News