Home » Siddipet
నిర్వహణ పనుల కారణంగా కొన్ని ఎంఎంటీఎస్, డెము, ఎక్స్ప్రెస్ సర్వీసులను కొద్ది రోజులు రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు తెలిపారు.
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నర్సాయపల్లిలో హైదరాబాద్ రాష్ట్రాన్ని పాలించిన అసఫ్ జాహీ కాలం (17వ శతాబ్దం) నాటి వెండి నాణేలు లభ్యమయ్యాయి. గ్రామానికి చెందిన చల్ల మల్లారెడ్డి భూమిలో గురువారం గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి పనుల్లో
రాష్ట్రవ్యాప్తంగా గాలి వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వానకు ప్రజలు వణికిపోయారు. గాలివాన తీవ్రత ఉమ్మడి పాలమూరులో ఎక్కువగా ఉంది..! నాగర్కర్నూల్ జిల్లా తాడూరు కొమ్ముగుట్టలో నిర్మాణంలో ఉన్న రేకుల షెడ్డు గోడ కూలి నలుగురు మృతి చెందారు.
రోళ్లు పగిలేంతగా ఎండలు మండే రోహిణి కార్తె శనివారమే ప్రారంభమైంది. 15 రోజుల పాటు ఎండలు, వడగాలులు మరింత తీవ్రమవనున్నాయి. రాష్ట్రంలో నాలుగైదు రోజుల కిందటి వరకు 40 డిగ్రీలకు అటుఇటుగా నమోదైన ఉష్ణోగ్రత.. మళ్లీ 45 డిగ్రీలు దాటుతోంది.
సిద్దిపేట జిల్లాలో ఆదిమానవుల ఆనవాళ్లు లభ్యమయ్యాయి. ధూళిమిట్ట మండలం బెక్కల్లోని బెక్కల్ గుట్టకు పడమటి దిక్కున బృహద్ శిలాయుగం నాటి ఆదిమానవుల ఆవాస ప్రాంతం, ఇనుప రాతి నుంచి ఇనుమును సంగ్రహించే పరిశ్రమను చరిత్ర పరిశోధకుడు రెడ్డి రత్నాకర్ రెడ్డి గురువారం గుర్తించారు.
సహజీవనం వ్యవహారంలో సిద్దిపేట కమిషనరేట్ కు చెందిన కొమురెల్లి ఎస్. ఐ గా విధులు నిర్వహిస్తున్న నాగరాజుతో పాటు, కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ పీఎస్ కానిస్టేబుల్ పి. శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీపీ రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వికారాబాద్ జిల్లా కొడంగల్లోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో సీఎం రేవంత్రెడ్డి, భార్య గీతారెడ్డి, కుమార్తె నైనీశారెడ్డితో కలిసి ఓటు వేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రజాస్వామ్య దేశానికి దశ దిశ చూపేది ఓటు మాత్రమేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Harish Rao) పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన సిద్దిపేట పట్టణంలోని భారత్ నగర్ అంబిటాస్ పాఠశాలలో 114పోలింగ్ భూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
లోక్సభ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడిపిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆదివారం సాయంత్రం సిద్దిపేట కోమటి చెరువు వద్ద కొద్దిసేపు ఆహ్లాదంగా గడిపారు.
సిద్దిపేట అంబేడ్కర్ నగర్లో బీఆర్ఎస్ నాయకుడు జువ్వల కనకరాజు ఇంట్లో భారీగా మద్యం ఉందన్న సమాచారంతో పోలీసులు తనిఖీ చేశారు. ఆదివారం ఉదయం పోలీసులు ఆయన ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉంది.