Home » Skill Development Case
రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. విశ్వవిద్యాలయం ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.
మహిళల అభ్యున్నతి కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు టీడీపీ నేత, నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ తెలిపారు.
Andhrapradesh: స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ సుప్రీంకోర్టులో వాయిదా పడింది. ఈ పిటిషన్‌పై విచారణను మే 7 వరకు సుప్రీం కోర్టు వాయిదా వేసింది. మంగళవారం చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై సుప్రీంలో విచారణకు వచ్చింది. జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిపింది.
విజయవాడ ఎసీబీ కోర్టులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏసీబీ అధికారులు గురువారం ఛార్జీ షీటు దాఖలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కె. అచ్చెన్నాయుడు, గంటా సుబ్బా రావు, డాక్టర్ కే.లక్ష్మీనారాయణ తదితరుల పాత్ర ఉన్నట్లు అధికారులు ఛార్జీ షీట్‌లో పొందు పరిచారు.
టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి హైకోర్టులో బిగ్ రిలీఫ్ కలిగింది. స్కిల్ కేస్‌లో ఆయనపై ఎటువంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దని హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. స్కిల్ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.
న్యూఢిల్లీ: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. చంద్రబాబు కుటుంబం అధికారులను బెదిరిస్తోందని, వెంటనే బెయిల్ రద్దు చేయాలని గత వాదనల సందర్బంగా ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బెయిల్ రద్దు పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. మూడు వారాల తర్వాత పిటిషన్‌పై తదుపరి విచారణ ఉంటుందని జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ తో కూడిన ధర్మాసనం తెలిపింది.
Skill Development Scam Case: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణను వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ఈ కేసుపై సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. అయితే, కౌంటర్ దాఖలు చేసేందుకు తమకు సమయం కావాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోరారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ( Skill Development Case ) తీర్పులో సుప్రీంకోర్టు ( Supreme Court ) ఆసక్తికర అంశాలను ప్రస్తావించింది. ఇందుకు సంబంధించి బుధవారం ఓ కాపీని విడుదల చేసింది.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో(Skill Development Case) సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పునకు వైసీపీ(YSRCP) వక్రభాష్యం పలుకుతోందని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్(Kanakamedala Ravindra Kumar) అన్నారు.