Home » South Africa
భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మరో అరుదైన ఘనతను సాధించాడు. ఏకంగా 146 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసి తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.
SA Vs IND: సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికా-భారత్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు ఆట ముగిసింది. వెలుతురులేమి కారణంగా షెడ్యూల్ కంటే ముందు ఆటను ముగిస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 66 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది.
SA Vs IND: దక్షిణాఫ్రికా ఆటగాళ్ల నిరీక్షణకు తెరపడింది. టీమిండియాపై టెస్టుల్లో దాదాపు 9 ఏళ్ల తర్వాత సెంచరీ చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడిగా డీన్ ఎల్గార్ ఘనత సాధించాడు. సెంచూరియన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో డీన్ ఎల్గార్ సెంచరీ చేశాడు.
SA Vs IND: సెంచూరియన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా గౌరవప్రదమైన స్కోరు సాధించింది. రెండో రోజు ఉదయం సెషన్లో 67.4 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. కేఎల్ రాహుల్ ఒంటరి పోరాటం చేశాడు. సెంచరీతో అదరగొట్టడంతో టీమిండియా స్కోరు 200 పరుగులు దాటింది. 137 బాల్స్‌లో 14 ఫోర్లు, 4 సిక్సర్లలో కేఎల్ రాహుల్ 101 పరుగులు చేశాడు.
Team India: దక్షిణాఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్‌ను టీమిండియా పేలవంగా ప్రారంభించింది. దీనికి కారణం జట్టు ఎంపిక అనే చెప్పాలి. ఈ టెస్ట్ సిరీస్ ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2023-25 కింద నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ప్రతి టెస్టులో విజయం సాధించడం చాలా ముఖ్యం. అయితే భారత్ టీమ్ మేనేజ్మెంట్ ఆలోచన తీసికట్టుగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు.
Rohit Sharma: దక్షిణాఫ్రికా గడ్డపై రోహిత్ పేలవ ఫామ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు దక్షిణాఫ్రికాలో రోహిత్ 9 టెస్ట్ ఇన్నింగ్స్‌లు ఆడగా ఒక్క హాఫ్ సెంచరీ కూడా సాధించలేకపోయాడు. అతడు వరుసగా 14, 6, 0, 25, 11, 10, 10, 47, 5 పరుగులు మాత్రమే చేశాడు. సగటు కేవలం 14.22 మాత్రమే. దీంతో 9 ఇన్నింగ్స్‌లు ఆడి ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయిన తొలి టీమిండియా బ్యాటర్‌గా రోహిత్ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
SA Vs IND: సెంచూరియన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు వరుణుడు అంతరాయం కలిగించాడు. 59 ఓవర్ల తర్వాత వర్షం రావడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. అప్పటికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్ రాహుల్ (70), సిరాజ్ (0) ఉన్నారు.
దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా ప్రస్తుతం టెస్ట్ సిరీస్ ఆడుతోంది. అయితే సీనియర్ ఆటగాళ్ల స్థానంలో యువ ఆటగాళ్లను టీమ్ మేనేజ్మెంట్ తీసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో 17 ఏళ్ల తర్వాత పుజారా, రహానెలలో ఒక్కరు కూడా లేకుండా టీమిండియా టెస్టు ఆడుతుండటం ఇదే తొలిసారి.
SA Vs IND: దక్షిణాఫ్రికా గడ్డపై టీమిండియా ఇప్పటికే టీ20, వన్డే సిరీస్‌లను ఆడేసింది. మంగళవారం నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. తొలి టెస్టు సెంచూరియన్ వేదికగా జరగనుంది. అయితే ఈనెల 26 నుంచి జరిగే బాక్సింగ్ డే టెస్టుకు వరుణుడి గండం పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు నివేదిక ఇచ్చారు.
SA Vs IND: దక్షిణాఫ్రికా పర్యటనలో మూడు వన్డేల సిరీస్‌లో చివరి వన్డే బోలెండ్ పార్క్ వేదికగా జరుగుతోంది. అయితే ఈ వన్డేలోనూ టీమిండియా టాస్ ఓడిపోయింది. తొలి రెండు మ్యాచ్‌లలోనూ టీమిండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ గెలవలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మరోసారి ఫీల్డింగ్ ఎంచుకుంది.