Share News

SA Vs IND: నిరీక్షణకు తెర.. 9 ఏళ్ల తర్వాత సెంచరీ చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడు

ABN , Publish Date - Dec 27 , 2023 | 09:07 PM

SA Vs IND: దక్షిణాఫ్రికా ఆటగాళ్ల నిరీక్షణకు తెరపడింది. టీమిండియాపై టెస్టుల్లో దాదాపు 9 ఏళ్ల తర్వాత సెంచరీ చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడిగా డీన్ ఎల్గార్ ఘనత సాధించాడు. సెంచూరియన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో డీన్ ఎల్గార్ సెంచరీ చేశాడు.

SA Vs IND: నిరీక్షణకు తెర.. 9 ఏళ్ల తర్వాత సెంచరీ చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడు

దక్షిణాఫ్రికా ఆటగాళ్ల నిరీక్షణకు తెరపడింది. టీమిండియాపై టెస్టుల్లో దాదాపు 9 ఏళ్ల తర్వాత సెంచరీ చేసిన దక్షిణాఫ్రికా ఆటగాడిగా డీన్ ఎల్గార్ ఘనత సాధించాడు. సెంచూరియన్ వేదికగా టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో డీన్ ఎల్గార్ సెంచరీ చేశాడు. 2013-14లో చివరిసారిగా సొంతగడ్డపై ఆడుతున్న టెస్టుల్లో టీమిండియాపై దక్షిణాఫ్రికా బ్యాటర్ సెంచరీ చేశాడు. ఆ సిరీస్‌లో డుప్లెసిస్, డివిలియర్స్, జాక్ కలిస్ సెంచరీలు చేశారు. ఆ తర్వాత సొంతగడ్డపై భారత్‌తో తలపడుతున్న టెస్ట్ సిరీస్‌లలో దక్షిణాఫ్రికా ఆటగాడు సెంచరీ చేయడం ఇదే తొలిసారి.

మరోవైపు దక్షిణాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గార్‌కు టెస్టుల్లో ఇది 14వ సెంచరీ. ఈ నేపథ్యంలో సొంతగడ్డపై భారత్‌తో జరుగుతున్న టెస్టుల్లో సెంచరీ చేసిన మూడో ఓపెనర్‌గా ఎల్గార్ నిలిచాడు. గతంలో హెర్ష్‌లీ గిబ్స్ 2001లో రెండు సెంచరీలు (107, 196) చేయగా.. గ్యారీ కిరెస్టన్ 1997లో సెంచరీ (103) చేశాడు. తాజాగా సెంచూరియన్ టెస్టులో ఎల్గార్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. కాగా డీన్ ఎల్గార్‌కు ఇది ఫేర్‌వెల్ సిరీస్ కావడం మరో విశేషం. ఈ టెస్ట్ సిరీస్‌తో అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పనున్నాడు. ఓ ఎండ్‌లో వికెట్లు పడినా.. మరోవైపు భారత బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచి 140 బంతుల్లోనే ఎల్గార్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది అతడి కెరీర్‌లోనే ఫాస్టెస్ట్ శతకం కావడం గమనించాల్సిన విషయం.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 27 , 2023 | 09:07 PM