Home » Supreme Court
జైళ్లలో కులం ఆధారంగా ఖైదీలకు పనులు కేటాయించడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని తీర్పు ఇచ్చింది.
తిరుమల శ్రీవేంకటేశ్వరుడ్డి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తునే కొనసాగించాలా.. లేక కేంద్రం విచారణ జరిపించాలా అన్న అంశంపై సస్పెన్స్ శుక్రవారం వీడనుంది.
సుప్రీం కోర్టు ఆగస్ట్ 1వ తేదీన ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పునకు సీఎం రేవంత్ రెడ్డి విరుద్ధంగా వ్యవరిస్తున్నారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ చేసే హక్కు రాష్ట్ర ప్రభత్వానికి ఉందని సుప్రీం కోర్టు చెప్పిందని తెలిపారు.
జైలు మాన్యువల్స్‌లో క్యాస్ట్ కాలమ్‌ను తొలగించాలని కేంద్రం, రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. చిన్న కులాల ఖైదీలతో మరుగుదొడ్లు కడిగించడం వంటి స్కావెంజింగ్ పనులు, అగ్ర కులాల వారికి వంట పనుల కేటాయింపు వివక్షే అవుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది.
పార్టీ గుర్తు గడియారంతో తమకు ఎంతో అనుబంధం ఉందని, ఎన్నికల ప్రక్రియలో నిష్పాక్షికత, స్పష్టత కోసం, ఓటర్లలో అయోమయం నెలకొనకుండా అజిత్ వర్గం కొత్త గుర్తు కోసం దరఖాస్తు చేసుకోవాలని శరద్ పవార్ కోరారు.
అక్రమ మైనింగ్‌తో ఏపీ, కర్నాటక రాష్ట్రాల సరిహద్దులు చెరిపివేశారన్న ఆరోపణలతో 14 ఏళ్లుగా మైనింగ్ జరుపుకుండా నిలుపుదల చేశారని ఓబులాపురం మైనింగ్ కంపెనీ న్యాయవాదులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో కేంద్ర పర్యావరణ కమిటి పరిశీలన జరిపి కేంద్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసిందని న్యాయవాదులు తెలిపారు.
సైబర్ నేరగాళ్లు చెలరేగిపోతున్నారు. వీడియో కాల్ చేసి.. పోలీసుల్లా మాట్లాడుతూ.. అరెస్టు చేస్తాం అని బెదిరించి డబ్బులు దండుకునే గ్యాంగులకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.
కేసుల అత్యవసర విచారణ విధానాన్ని దుర్వినియోగం చేయవద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మంగళవారం న్యాయవాదులకు హితవు పలికారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నేత బీఎస్పీ వట్టే జానయ్యను వేధించారన్న కేసులో ఈ నెల 4న హాజరు కావాల్సిందిగా సుప్రీంకోర్టు తెలంగాణ డీజీపీని ఆదేశించింది.
రహదారులు, జలాశయాలు, రైల్వే ట్రాక్‌లను ఆక్రమించి నిర్మించిన ఏ మతానికి సంబంధించిన కట్టడాలనైనా తొలగించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.