Home » Suryapet
హైదరాబాద్-విజయవాడ (ఎన్‌హెచ్-163) జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణ చర్యలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. జూన్ 4న రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల కోడ్ ముగియగానే పనులు ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ సహా పనుల బాధ్యతను ఎన్హెచ్ఏఐ ఓ ఏజెన్సీకి అప్పగించింది.
పాత కక్షలు ఓ యువకుడి ప్రాణం తీశాయి. సూర్యాపేట జిల్లా టేకుమట్ల గ్రామ శివారులో ఈ నెల 23న జరిగిన నందికొండ వెంకటేశ్(25) కిడ్నాప్ కేసు విషాదాంతమైంది.
స్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) ఇవ్వకుండా ధాన్యాన్ని పక్కదారి పట్టించారన్న ఆరోపణలపై సూర్యాపేట జిల్లా రైస్‌మిల్లర్స్ అసోయేషన్ అధ్యక్షుడు ఇమ్మడి సోమ నర్సయ్య, ఆయన సోదరుడు సోమయ్యను పోలీసులు ఆదివారం రాత్రి అరెస్ట్ చేశారు.
Telangana: మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని కావాలని ప్రజలు భావిస్తున్నారని బీజేపీ నేతలు ఈటల రాజేందర్, బీబీ పాటిల్ అన్నారు. కోదాడలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమావేశంలో వీరు పాల్గొని ప్రసంగించారు. నల్గొండలో బీజేపీకి డిపాజిట్ రాదు అనేది అవగాహన లేనివారు అహంకారంతో మాట్లాడేవని అన్నారు. ఎన్ని డబ్బులు పెట్టినా ధర్మం న్యాయం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో వచ్చే ఐదు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈనెల 22న నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలున్నాయని.. ఇది బలపడి 24 నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం దక్షిణ ఛత్తీ్‌సగఢ్ నుంచి కొమరిన్ ప్రాంతం వరకు కొనసాగిన ఉపరితల ఆవర్తనం.. శనివారం దక్షిణ ఛత్తీ్‌సగఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని తెలిపింది.
నవమాసాలు మోసి, పురిటినొప్పులను భరించి.. తమను కని, పెంచిన ఆ తల్లి రుణాన్ని తీర్చుకోకపోగా.. శవం వద్దే ఆస్తి పంపకాల కోసం ఆమె కొడుకు, కూతుళ్లు తగవులాడుకున్న ఉదంతమిది..! చిన్నప్పుడు తల్లి వద్ద మారాం చేసి మరీ తనకు కావాల్సినవి సమకూర్చుకున్న ఆ కొడుకు.. ఇప్పుడు పైసలిస్తేనే తలకొరివి పెడతానంటూ మారాం చేస్తున్నాడు. దీంతో.. కూతుళ్లు తమ ఇళ్లకు వెళ్లిపోగా.. ఆ అమ్మ మృతదేహం రెండ్రోజులుగా ఫ్రీజర్‌లో ఉండిపోయింది.
సూర్యాపేట జిల్లా: కోదాడ శివారు దుర్గాపురం వద్ద హైదరాబాద్- విజయవాడ 65వ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది.
Telangana: అధికార పార్టీ కాంగ్రెస్‌కు (Congress) చెందిన నేత కనిపించకుండా పోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఎల్కారంకి చెందిన కాంగ్రెస్ నేత ఒకరు గత రెండు రోజులుగా కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో కాంగ్రెస్ నేత అదృశ్యమైన వార్త జిల్లాలో సంచలనంగా మారింది. ఇంతకీ సదరు నేత ఎక్కడికి వెళ్లారు?... ఎవరైనా కిడ్నాప్ చేశారా?.. ఇంతకీ ఏ పని మీద వెళ్లి కనిపించకుండా పోయారో ఇప్పుడు చూద్దాం...
నల్గొండ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆదివారం నేడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ ఉదయం 9 గంటలకు యాదాద్రి భువనగిరి జిల్లా మీదుగా జనగామకు వెళతారు. 11 గంటలకు సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి మండలం వెలుగుపల్లిలో ఎండిన పొలాలను పరిశీలిస్తారు.
సూర్యాపేట: హుజూర్నగర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి టెలికాన్ఫరెన్స్ వాయిస్ రికార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటోంది. బీఆర్ఎస్ పరిస్థితి అర్థం కావడం లేదు. పార్లమెంటుకు పోటీ చేయాలంటే ఆ పార్టీ నేతలు చాలామంది భయపడుతున్నార’ని హుజూర్నగర్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.