Suryapet: మనవడిని రెచ్చగొట్టిన నాయనమ్మ.. సూర్యాపేట పరువు హత్య కేసులో ట్విస్ట్
ABN , Publish Date - Jan 29 , 2025 | 11:30 AM
Telangana: సూర్యాపేటలో దారుణ హత్యకు గురైన కృష్ణ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. భార్గవి కుటుంబసభ్యులే కృష్ణను హత్య చేసినట్లు తెలుస్తోంది. రాత్రంతా మృతదేహాన్ని కారులోనే తిప్పుతూ చివరకు మూసీ కాలువ వద్ద పడేశారు నిందితులు.

సూర్యాపేట, జనవరి 29: సూర్యాపేటలో (Suryapet) సంచలనం సృష్టించిన వడ్లకొండ కృష్ణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కృష్ణ హత్యకు కులాంతర వివాహం కారణంగా పోలీసులు గుర్తించారు. ఆరు నెలల క్రితం స్నేహితుడు కోట్ల నవీన్ చెల్లి భార్గవిని కృష్ణ అలియాస్ మాల బంటి పెళ్లి చేసుకున్నాడు. ఈ వివాహాన్ని భార్గవి నాయనమ్మ బుచ్చమ్మ మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. ఈ క్రమంలో మనవడు నవీన్‌ను రెచ్చగొట్టడంతోనే కృష్ణ హత్యకు స్కెచ్ వేశాడు. అనుకున్న ప్రకారమే కృష్ణతో కొద్దికాలంగా స్నేహంగా ఉంటూ వచ్చిన నవీన్.. అదును చూసి అతడిని హతమార్చాడు. ఇందుకోసం తాళ్లగడ్డకు చెందిన బైరు మహేశ్‌తో పాటు మరో యువకుడి సాయం తీసుకున్నాడు.
ఈనెల 19నే కృష్ణను హత్య చేయాలని వారు భావించారు. అది కుదరకపోవడంతో గత ఆదివారం కృష్ణను దారుణంగా హత్య చేశారు. కృష్ణ హత్య అనంతరం మృతదేహాన్ని ఆత్మకూర్ (ఎస్) మండలం పాత సూర్యాపేటలో ఉన్న నాయనమ్మ బుచ్చమ్మకు చూపించారు నిందితులు. ఆపై నల్గొండలోని మరో మిత్రుడికి కృష్ణ మృతదేహాన్ని చూపించాడు నవీన్. ఆ తరువాత మృతదేహాన్ని చాలా దూరంలో పారేయాలని నిర్ణయించి దాదాపు 100 కిలో మీటర్ల వరకు ప్రయాణించారు. కారులో మృతదేహాన్ని ఉంచి రాత్రంతా తిరిగి చివరకు తెల్లవారు జామున జనగామ రహదారి నుంచి పిల్లలమర్రి వెళ్లే మూసీ కాలువ వద్ద వదిలిపెట్టారు నిందితులు. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలను ఈరోజు సాయంత్రం పోలీసులు మీడియాకు వెల్లడించనున్నారు.
AP Govt Serious on Peddireddy: పెద్దిరెడ్డిపై చర్యలకు సర్కార్ సిద్ధం...
కాగా.. సూర్యాపేట మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ, సూర్యాపేట పిల్లల మర్రికి భార్గవి మూడేళ్లుగా ప్రేమించుకున్నారు. ఈ విషయంలో తెలియడంతో భార్గవి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. అంతే కాకుండా భార్గవికి వేరే వ్యక్తితో పెళ్లి నిశ్చయం చేశారు. ఆ పెళ్లి ఇష్టం లేని భార్గవి గత ఏడాది ఆగస్టులో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆపై నకిరేకల్‌లో కృష్ణ, భార్గవి వివాహం చేసుకున్నారు. చెల్లెల్లి వివాహం తెలిసి భార్గవి సోదరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాగైన కృష్ణను అంతమొందించాలని ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. వాళ్ల ప్లాన్‌లో భాగంగా కృష్ణతో మంచి ఉంటూ వచ్చి.. చివరకు అతడిని దారుణంగా హతమార్చారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇలా దారుణ హత్యకు గురవడంతో భార్గవి కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఇవి కూడా చదవండి...
High Court: ఉస్మానియా ఆస్పత్రిని తరలిస్తే తప్పేంటి..
జగన్ హయాంలో పాఠశాలల బాగు ఉత్తుత్తే..
Read Latest Telangana News And Telugu News