Home » T20 Cricket
ఐపీఎల్ సీజన్ నుంచి తాత్కాలిక విరామం తీసుకుంటానని మ్యాక్స్‌వెల్ ప్రకటించారు. ఈ సీజన్‌లో మ్యాక్స్ వెల్ నుంచి గొప్ప ఇన్నింగ్స్ రాలేదు. నిన్నటి తుది జట్టులో చోటు లభించలేదు. మ్యాక్స్ వెల్ స్థానంలో విల్ జాక్స్‌ను తీసుకున్నారు. తన స్థానంలో మరొకరిని తీసుకోవాలని కెప్టెన్ డుప్లెసిస్‌కు మ్యాక్స్‌వెల్ స్పష్టం చేశారు.
ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య నిన్న జరిగిన మ్యాచ్ మంచి ఊపు తీసుకొచ్చింది. చివరి ఓవర్‌లో వచ్చిన మహేంద్ర సింగ్ ధోని పరుగుల వరద పారించాడు. కేవలం నాలుగు బంతుల్లో ఎదుర్కొని 20 పరుగులు చేశాడు.
వండర్స్ క్రియేట్ చేయడంలో ఎప్పుడూ ముందుండే ముంబై ఇండియన్స్ జట్టు తాజాగా ఓ చారిత్రాత్మక రికార్డ్‌ని నమోదు చేసింది. టీ20 క్రికెట్ చరిత్రలో (ఐపీఎల్, సీఎల్‌టీ20తో కలిపి) 150 విజయాలు సాధించిన మొట్టమొదటి జట్టుగా సంచలన రికార్డ్‌ని సృష్టించింది.
టీ 20 వరల్డ్ కప్ సిరీస్‌కు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సారథ్యం వహిస్తాడని బీసీసీఐ సెక్రటరీ జై షా స్పష్టంచేశారు.
T20 World Cup 2024: క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించేందుకు సిద్ధమైంది ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సిరీస్. తాజాగా టీ20 వరల్డ్ కప్‌కు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. జూన్ 2 నుంచి 29వ తేదీ వరకు జరుగున్న ఈ టోర్నమెంట్‌కు సంబంధించి టికెట్లను జారీ చేసింది ఐసీసీ. పబ్లిక్ టిక్కెట్ బ్యాలెట్ విధానంలో విక్రయిస్తున్నారు.
అఫ్గానిస్తాన్‌తో గురువారం నుంచి టీమిండియా మూడు మ్యాచ్‌ల టీ-20 సిరీస్ ఆడబోతోంది. ఈ మ్యాచ్‌లో యువ ఆటగాళ్లను కాదని సీనియర్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి బీసీసీఐ చోటు కల్పించింది. ఈ ఏడాది టీ-20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో సెలక్షన్ కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది.
World Record: ఐసీసీ టీ20 ర్యాంకుల్లో నంబర్‌వన్‌గా కొనసాగుతున్న టీమిండియా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో ప్రపంచ రికార్డు సాధించింది. రాయ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో తక్కువ స్కోరు చేసినా 20 పరుగుల తేడాతో టీమిండియా గెలిచింది. దీంతో టీ20 ఫార్మాట్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా అవతరించింది.
T20 Cricket: టీమిండియా ఈరోజు గౌహతి వేదికగా ఆస్ట్రేలియాతో మూడో టీ20లో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే టీ20 సిరీస్‌తో పాటు ప్రపంచ రికార్డును సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మాథ్యూ వేడ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. నాలుగు మార్పులతో తాము బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశాడు.
రెండో టీ20లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. 44 పరుగుల తేడాతో ఆసీస్‌పై టీం ఇండియా గెలుపొందింది. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు టీం ఇండియా 236 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించగా.. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా విజయాన్ని అందుకోలేకపోయింది.
Rinku Singh: విశాఖ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా విజయం సాధించాలంటే చివరి బంతికి ఒక్క పరుగు అవసరం ఉండటంతో సీన్ అబాట్ వేసిన బంతికి రింకూ సింగ్ సిక్సర్ బాదాడు. అయితే అతడి సిక్సర్‌ను స్కోరులో కలపలేదు. దీంతో పలువురు అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.