IPL 2024: కోహ్లి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత.. ఎందుకంటే..?
ABN , Publish Date - Apr 22 , 2024 | 06:05 PM
ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లి దురుసు ప్రవర్తన నేపథ్యంలో మ్యాచ్ ఫీజులతో కోత విధించారు. నిన్న కోల్ కతాతో జరిగిన మ్యాచ్‌లో ఔటయిన తర్వాత కోహ్లి అంపైర్లతో వాదనకు దిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత థర్డ్ ఎంపైర్ కూడా ఔట్ ఇవ్వడంతో ఆగ్రహంతో పెవిలియన్ చేరాడు.
ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లి (Virat Kohli) దురుసు ప్రవర్తన నేపథ్యంలో మ్యాచ్ ఫీజులతో కోత విధించారు. నిన్న కోల్ కతాతో జరిగిన మ్యాచ్‌లో ఔటయిన తర్వాత కోహ్లి అంపైర్లతో వాదనకు దిగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత థర్డ్ ఎంపైర్ కూడా ఔట్ ఇవ్వడంతో ఆగ్రహంతో పెవిలియన్ చేరాడు. ఈ అంశంపై ఐపీఎల్ అడ్వైజరీ బోర్డు చర్చించింది. కోహ్లి ప్రవర్తన సరికాదని అభిప్రాయ పడింది. నిన్నటి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
IPL 2024: అంపైర్లపై కోహ్లి ఆగ్రహం.. ఎందుకంటే..?
కోల్ కతా నైట్ రైడర్స్‌తో ఈడెన్ గార్డెన్స్‌లో నిన్న మ్యాచ్ జరిగింది. 18 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హర్షిత్ బౌలింగ్‌లో కోహ్లి రిటర్న్ క్యాచ్ ఇచ్చాడు. అంపైర్ ఔట్ ఇవ్వడంతో ఆర్సీబీ తరఫున కోహ్లి రివ్యూ తీసుకున్నాడు. అయినప్పటికీ కోహ్లి ఔట్ అయినట్టు అంపైర్ ప్రకటించాడు. దీంతో కోహ్లిలో ఆగ్రహం ఒక్కసారిగా బయటకు వచ్చింది. క్రీజు నుంచి బయటకు వెళ్లే సమయంలో అంపైర్‌తో గొడవ పడుతూ వెళ్లాడు. డగౌట్ వద్ద బ్యాట్‌ను నెలకేసి కొట్టాడు. చైర్స్ ఉన్న వద్ద బిన్‌ను తోసేశాడు. తర్వాత దానిని ఎప్పటిలాగే అక్కడ పెట్టాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. ఈ అంశంపై చర్చ జరిగింది. అంపైర్‌తో వాదన నేపథ్యంలో కోహ్లిపై ఐపీఎల్ అడ్వైజరీ బోర్డు చర్యలు తీసుకుంది.
IPL 2024: రూ.18.5 కోట్లు వృథా.. అతడికి తుది జట్టులో ఉండే అర్హత కూడా లేదు.. సెహ్వాగ్ ఫైర్!
Read Latest Sports News or Telugu News