Home » TANUKU
Andhrapradesh: తణుకు అన్న క్యాంటీన్లో ప్లేట్ల అంశంపై వైసీపీ విష ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చేతులు కడిగే సింక్లో తినే ప్లేట్లు పడేసింది వైసీపీ మూకలే అని అన్నారు. విషప్రచారం చేసేందుకే సైకో బ్యాచ్ ఈ పనిచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తణుకు(Tanuku) మండలం దువ్వ గ్రామం(Duvva village)లో దారుణం జరిగింది. ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద ఘర్షణ ఒకరి ప్రాణాలను బలి తీసుకుంది.
మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఆయన అనుచరులు ప్రజల భూములను కొట్టేశారని.. వారి భూమికి రక్షణ లేకుండా చేశారని తణుకు నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ (Arimilli RadhaKrishna) సంచలన ఆరోపణలు చేశారు . మంత్రి కారుమూరి కారుకూతలు కుస్తూనే ఉన్నారని.. ఆయనను ఎవరూ పట్టించుకోరని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. ఎన్డీయే కూటమి తరపున చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఈరోజు తణుకులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
YSRCP vs TDP: ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైఎస్ఆర్సీపీ చీఫ్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు వరుస షాక్లు తగులుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి చెందిన కీలక నేత ఒకరు గుడ్ చెప్పారు. నేరుగా వెళ్లి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ఈ పరిణామం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
అవును.. మీరు వింటున్నది నిజమే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) తణుకు సభ సాక్షిగా ‘చింతిస్తున్నా.. క్షమించండి’ అని కార్యకర్తలు, అభిమానులు, నేతల ముందే అడిగారు. కొంపదీసి ఇటీవల రచ్చ రచ్చ జరుగుతున్నా ‘వలంటీర్ వ్యవస్థ’పై వెనక్కితగ్గి క్షమాపణలు చెప్పారనుకుంటున్నారా.. అస్సలు కాదండోయ్. ఇంతకీ సేనాని ఎందుకు క్షమాపణలు చెప్పారబ్బా అనేగా మీ సందేహం..? ఇక ఆలస్యమెందుకు చకచకా ఈ వార్త చదివేయండి అసలు విషయమేంటో మీకే అర్థమైపోతుంది..
జిల్లాలోని తణుకు మండలం దువ్వలో రైతు భరోసా కేంద్రం వద్ద రైతులు నిరసనకు దిగారు.