CM Chandrababu Swatch Andhra: రెట్టింపుగా పనిచేస్తా.. సహకారం ఇవ్వండి
ABN , Publish Date - Mar 15 , 2025 | 12:19 PM
CM Chandrababu Swatch Andhra: స్వచ్చ్ దివస్ కార్యక్రమంలో భాగంగా తణుకు ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో ప్రజలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. చివరి రక్తపు బొట్టు వరకు ప్రజలకు సేవ చేస్తానని.. రాబోయే 22 ఏళ్లలో ఏపీని దేశంలో నెంబర్ వన్‌గా చేస్తానని సీఎం స్పష్టం చేశారు.

పశ్చిమగోదావరి, మార్చి 15: జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పర్యటన కొనసాగుతోంది. స్వచ్చ్ దివస్ కార్యక్రమంలో భాగంగా తణుకులో ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్ద ప్రజలతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎంను ప్రజలు పలు ప్రశ్నలు వేశారు. దానికి చంద్రబాబు సమాధానం ఇచ్చారు. ‘47 ఏళ్ల క్రితం అసెంబ్లీకి వెళ్ళాను. 41 ఏళ్లుగా అసెంబ్లీకి వెళుతున్నాను. పదేళ్లు ప్రతిపక్ష నేతగా పనిచేశాను. నా జీవితం అంతా అలుపెరుగని పోరాటం. నా చివరి రక్తపు బొట్టు వరకు మీకు సేవ చేయాలనేదే నా సంకల్పం. ఇప్పటి వరకు ఎంత పనిచేశానో, రాబోయే 5, 10 ఏళ్లలో అంతకంటే రెట్టింపుగా పనిచేస్తాను. మీ సహకారం ఇవ్వండి. రాబోయే 22 ఏళ్లలో మన రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్‌గా చేస్తాను’ అని చంద్రబాబు తెలిపారు.
అలాగే అడిగిన మరికొన్ని ప్రశ్నలకు కూడా సీఎం రిప్లై ఇచ్చారు. ఆరోగ్యశ్రీలో కొన్ని టెస్టులు చేయడం లేదని నందిని అనే మహిళ ప్రశ్నించారు. అలాగే పెన్షన్ కోసం సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసినా ఇవ్వడం లేదని మరొకరు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ముఖ్యమంత్రి సమాధానమిస్తూ.. ‘నేను వచ్చింది మీకు బాధ్యతలు కూడా గుర్తు చేయడానికి. ఇలా ఏ సీఎం అయినా నాలాగా వచ్చారా.. ఎవరికైనా మైక్ ఇచ్చారా.. ఎవరైనా వచ్చినా పరదాలు కట్టుకుని వచ్చారు.. విమానంలో అలా తిరిగి వెళ్ళిపోయేవారు. ఇది ప్రజా ప్రభుత్వం.. సంక్షేమం, అభివృద్ధి రెండు చేయాలనేదే నా అభిమతం. 2004లో టీడీపీని గెలిపించి ఉంటే ఏపీ ఎక్కడికో వెళ్ళిపోయేది. 2019లో నన్ను గెలిపించి ఉంటే, విభజన రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెంది ఉండేది. దానిలో నా తప్పు ఉంది. గుజరాత్‌లో స్థిరమైన ప్రభుత్వం వలన అభివృద్ధి సాధ్యమైంది. స్థిరమైన ప్రభుత్వం ఉంటే అభివృద్ధి స్థిరంగా సాగుతుంది’’ అని చెప్పుకొచ్చారు. ఏపీలో ఇప్పుడు ఉన్నది ప్రజాప్రభుత్వమన్నారు. వైసీపీకి అధికారం ఇస్తే ఏపీని అంధకారంలోకి నెట్టేశారని మండిపడ్డారు. వేరే వాళ్లు వస్తే ఏదో చేస్తారని ఓట్లేశారన్నారు. ఐదేళ్లలో విపరీతంగా అపపులు చేసి వెళ్లారని సీఎం వ్యాఖ్యలు చేశారు.
స్వచ్ఛాంధ్ర ఉద్యమం...
మన ఆరోగ్యానికి ఎందుకు ఇబ్భందులు వస్తున్నాయో ఆలోచించాలన్నారు. తిండి, తాగేనీరు, అపరిశుభ్రత వలన వస్తున్నాయని కూడా గమనించాలన్నారు. ఆరోగ్య శ్రీ, సీఎం రిలీఫ్ ఫండ్‌తో 25 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తున్నామని తెలిపారు. స్వర్ణాంధ్ర 2047 విజన్ రూపొందించామన్నారు. విజన్ రూపొందించడమే కాదని.. తలసరి ఆదాయం పెరిగిందా లేదా అని పరిశీలిస్తున్నామని అన్నారు. వారసత్వంగా 87 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను వదిలిపోయారని...దానిని తీయడానికి నాలుగైదు నెలలు పడుతుందన్నారు. స్వర్ణాంధ్ర కోసం ఉద్యమం చేస్తూనే, స్వచ్ఛాంధ్ర కోసం ఉద్యమం చేయాలన్నారు. వేస్ట్ ఎనర్జీ కింద కంపోస్టు తయారుచేయడానికి ఒక టెక్నాలజీ వచ్చిందని తెలిపారు. బయో డైవర్సిటీ పేరుతో 10 లక్షలతో మెటీరియల్ పెడితే, కంపోస్టు తయారు చేయవచ్చని చెప్పారు. తణుకు ఎన్టీఆర్ పార్క్‌ను తాను డెవలప్ చేశానని.. కానీ దానిని నాశనం చేశారని ఫైర్ అయ్యారు.
ప్లాస్టిక్ ప్రమాదకరం...
‘ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం వచ్చినపుడు, మీరు కూడా బాధ్యతతో వ్యవహరిస్తే, మంచి ఫలితాలు వస్తాయి. ఒకప్పుడు పారిశుధ్య కార్మికులను చులకనగా చూసేవారు. వారు మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. వారిపై గౌరవం పెరిగింది.. మునిసిపల్ కార్మికులు అందరిని ఆదుకుంటాం. మీ పరిసరాలు, మీ ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. సమాజం కోసం, స్వర్ణాంధ్ర కోసం స్వచ్ఛందంగా పనిచేయడానికి ముందుకు వచ్చారు..వారిని అభినందించాలి. వారి కోసం ఒక యాప్‌ను రూపొందిస్తాం. ప్లాస్టిక్ చాలా ప్రమాదకరం.. పశువులు వాటిని తిని, చనిపోతున్నాయి. ప్లాస్టిక్ వలన తినే తిండి కూడా విషం అయిపోతున్నది. క్యాన్సర్ వచ్చినప్ఫుడు బాధ పడుతున్నాం. కానీ క్యాన్సర్ కారణమైన ఆహారం గురించి ఆలోచించాలి. రాష్ట్రంలో క్యాన్సర్ రాకుండా చేయడానికి నోరి దత్తాత్రేయుడుని సలహాదారుగా నియమించాం. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై యుద్ధమే చేయాలి. దానివలన చెడు పరిణామాలు ఉన్నాయి. ప్రమాదకరమైన ప్లాస్టిక్ తయారుచేసే వారిని నియంత్రిద్ఢాం’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
కాగా.. స్వచ్ఛ దివస్‌లో పాల్గొనేందకు ఈరోజు (శనివారం) ఉదయం తణుకు చేరుకున్న సీఎం చంద్రబాబుకు మంత్రులు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. మంత్రి నిమ్మల రామానాయుడు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె.పట్టాభి రామ్, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అశ్వి, తణుకు యంయల్ఏ ఆరుమిల్లి రాధాకృష్ణ, యంయల్ఏలు పులపర్తి రామాంజనేయులు, బొమ్మిడి నాయకర్, బొలిశెట్టి శ్రీనివాస్, పితాని సత్యనారాయణ, మద్దిపాటి వెంకటరాజు, శాసనమండలి మాజీ విప్ అంగర రామ్మోహన్.. సీఎంకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. ఆపై తణుకు జెడ్పీ బాలుర హైస్కూల్లో ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్దకు చేరుకున్న సీఎం.. స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిభిషన్‌ను తలికించారు. పర్యావరణాన్ని హితం చేసే డిస్పోజబుల్ వస్తువుల ప్రదర్శనను కూడా తిలకించారు సీఎం. అలాగే ప్రజావేదికపై నుంచి స్వచ్ఛాంద్రపై విద్యార్థినల గీతాలాపన అందరినీ ఆకట్టుకుంది. అలాగే రాష్ట్రంలో ఉత్తమ పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించిన పలువురిని సీఎం సత్కరించి, మెమొంటోలు బహుకరించారు.
ఇవి కూడా చదవండి...
Singarakonda Tirunallu:కనుల పండువగా సింగరకొండ తిరునాళ్లు
justice for Viveka: ఆరు ఏళ్లుగా పోరాడుతున్నా.. వివేకా కుమార్తె కన్నీరు
Read Latest AP News And Telugu News