Home » TATA IPL2023
టీ-20 క్రికెట్‌లో చిన్న చిన్న విషయాలే మ్యాచ్‌లను మలుపుతిప్పుతాయి. ఒక్క బాల్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తుంది. తాజాగా మంగళవారం సాయంత్రం గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య చెన్నైలో మ్యాచ్ జరిగింది.
టీమిండియా దిగ్గజ ఆటగాడు, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీకి ఈ ఐపీఎల్‌లో అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇదే ధోనీ చివరి ఐపీఎల్ అని వార్తలు వస్తుండడంతో అభిమానులు అతడికి ఘనంగా వీడ్కోలు పలకాలనుకుంటున్నారు.
చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎప్పట్నుంచో ఆడుతూ ఆ జట్టుకు కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. ప్రతి మ్యాచ్‌లోనూ బంతితోనూ లేదా బ్యాట్‌తోనూ రాణిస్తూ చెన్నై టీమ్‌కు ముఖ్యమైన ఆటగాడిగా మారాడు.
ఐపీఎల్ 2023 సీజన్ చివరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో కోహ్లీ, శుభ్‌మన్ గిల్ అద్భుత శతకాలతో ఆకట్టుకున్నారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ తరఫున కోహ్లీ సెంచరీ చేశాడు.
ఐపీఎల్ 2023 నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ నిష్క్రమించడం చాలా మందికి బాధ కలిగించింది. ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ ఆ టీమ్ ఒక్కసారి కూడా టైటిల్ సాధించలేదు. 16 సీజన్లలో కేవలం మూడు సార్లు మాత్రమే ఫైనల్ చేరింది.
గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇద్దరు స్టార్ ఆటగాళ్లు సెంచరీలతో ఆకట్టుకున్నారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ తరఫున విరాట్ కోహ్లీ (61 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 101 నాటౌట్) అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు.
ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఇంటి దారి పట్టింది. దీంతో లఖ్‌నవూ టీమ్ పండగ చేసుకుంటోంది. ఇప్పటికే ఈ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) అత్యంత కీలకమైన దశకు చేరుకుంది. ఈ లీగ్‌లోని అన్ని జట్లూ తమ లీగ్ మ్యాచ్‌లను ఆడేశాయి. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి.
బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ ఆసక్తికరంగా సాగింది. మొదట విరాట్ కోహ్లీ సెంచరీతో బెంగళూరు భారీ స్కోరు సాధించింది. బెంగళూరు నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని శుభ్‌మన్ గిల్ సెంచరీ కారణంగా గుజరాత్ ఛేదించింది.
ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది. ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిన బెంగళూరు ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్‌లో అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన విరాట్ కోహ్లీ, డుప్లెసి తమ జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చలేకపోయారు.