IPL 2023: ప్లే ఆఫ్స్‌కు రంగం సిద్ధం.. ఏయే మ్యాచ్‌లు ఎప్పుడంటే..

ABN , First Publish Date - 2023-05-22T12:47:15+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) అత్యంత కీలకమైన దశకు చేరుకుంది. ఈ లీగ్‌లోని అన్ని జట్లూ తమ లీగ్ మ్యాచ్‌లను ఆడేశాయి. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి.

IPL 2023: ప్లే ఆఫ్స్‌కు రంగం సిద్ధం.. ఏయే మ్యాచ్‌లు ఎప్పుడంటే..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) అత్యంత కీలకమైన దశకు చేరుకుంది. ఈ లీగ్‌లోని అన్ని జట్లూ తమ లీగ్ మ్యాచ్‌లను ఆడేశాయి. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన జట్లు ప్లే ఆఫ్స్‌కు (IPL Playoffs) చేరుకున్నాయి. గుజరాత్ టైటాన్స్ (GT), చెన్నై సూపర్ కింగ్స్ (CSK), లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG), ముంబై ఇండియన్స్ (MI) జట్లు పాయింట్ల పట్టికలో వరుసగా నాలుగు స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్స్‌కు చేరుకున్నాయి. ఈ జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉన్న గుజరాత్‌, చెన్నైలకు రెండు సార్లు క్వాలిఫయర్ ఆడే అవకాశం లభిస్తుంది.

ఐపీఎల్-2023 ప్లేఆఫ్స్ షెడ్యూల్

క్వాలిఫయర్-1: మే 23

గుజరాత్ టైటాన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్

వేదిక: చెపాక్ స్టేడియం (చెన్నై)

ఎలిమినేటర్: మే 24

లఖ్‌నవూ సూపర్ జెయంట్స్ vs ముంబై ఇండియన్స్

వేదిక: చెపాక్ స్టేడియం (చెన్నై)

క్వాలిఫయర్-2: మే 26

ఎలిమినేటర్‌లో విజేత vs క్వాలిఫయర్-1లో ఓడిన జట్టు

వేదిక: నరేంద్రమోదీ స్టేడియం (గుజరాత్)

ఫైనల్: మే 28

క్వాలిఫయర్-1 విజేత vs క్వాలిఫయర్-2 విజేత

వేదిక: నరేంద్రమోదీ స్టేడియం (గుజరాత్)

అన్ని మ్యాచ్‌లు రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతాయి.

Updated Date - 2023-05-22T12:47:15+05:30 IST

News Hub