Home » TDPProtest
అనంతపురం జిల్లా: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ రాయదుర్గంలో కమ్మ సంఘం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహం నుంచి లక్ష్మి బజార్ మీదుగా ఈ ర్యాలీ కొనసాగనుంది.
తిరుపతి: చంద్రబాబు అక్రమ అరెస్టుపై తెలుగుదేశం మండిపడుతోంది. ఏపీ వ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేసింది. సీఎం జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని గురువారం తిరుపతిలో టీడీపీ నేతలు ఆరోపించారు.
విశాఖ: చంద్రబాబు అక్రమ అరెస్టును నిరిసిస్తూ బుధవారం విశాఖలో టీడీపీ నేతలు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ఉత్తర నియోజక వర్గం టీడీపీ ఇన్చార్జ్ విజయబాబు ఆధ్వర్యంలో జగ్గరావు బ్రిడ్జి దగ్గర ఐస్ గడ్డలపై నిలుచుని నిరసన తెలిపారు. ‘బాబుతో నేనూ’ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు.
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద రెండు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్నారు. దీంతో కాల్వ శ్రీనివాసుల దీక్షను పోలీసులు ఆదివారం తెల్లవారుజామున భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు.
విశాఖ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ విశాఖ ఆర్కే బీచ్లో టీడీపీ నేతలు వినూత్నరీతిలో నిరసన చేపట్టారు. ఇసుకలో అర్ధ సమాధి చేసుకున్న నేతలు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బెంగళూరు: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ బెంగళూరులో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబుతో మేమూ అంటూ శుక్రవారం జయనగర్లోని వినాయకస్వామి ఆలయంలో తెలుగు ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఎన్నారై టీడీపీ బెల్జియం (NRI TDP Belgium) అధ్యక్షుడు అలవాలపాటి శివకృష్ణ, కొండూరు దినేష్ వర్మ ఆధ్వర్యంలో బ్రస్సెల్స్లో నిరసన కార్యక్రమం చేపట్టారు.
అమరావతి: యువగళం వాలంటీర్లను అక్రమంగా అరెస్టు చేయడంపై తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ ఆధ్వర్యంలో బీసీ శ్రేణులు నిరసన తెలుపుతూ.. విజయవాడ రామవరప్పాడు రింగ్ దగ్గర రోడ్డుపై బైఠాయించారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీ నేతలు తాడిగడపలోని ఖనిజాభివృద్ది సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆఫీసు వద్ద నిరసనకు దిగారు. ఇబ్రహీంపట్నం వద్ద భారీగా పోలీసులు మోహరించటంతో టీడీపీ నేతలు వ్యూహం మార్చుకుని తాడిగడప ఖనిజాభివృద్ది సంస్థ కార్యాలయాన్ని ముట్టడించారు.
అమరావతి: తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ మంత్రి వంగలపూడి అనితపై సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెడుతున్నారంటూ తెలుగు మహిళలు నిరసనకు దిగారు. మహిళల్ని కాపాడాలంటూ ఇంద్రకీలాద్రి వద్ద విజయవాడ కనకదుర్గమ్మకు కొబ్బరికాయలు కొట్టారు.