Home » Telangana High Court
Telangana: జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. రాహిల్‌ను రెండు వారాల వాటు అరెస్టు చేయకుండా ధర్మాసనం స్టే విధించింది. గతంలో రాహిల్‌కు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సవాల్ చేస్తూ జూబ్లీహిల్స్ పోలీసులు అపీల్‌కు వెళ్లారు. ఈరోజు (మంగళవారం) పోలీసుల పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.
మార్గదర్శి ఫైనాన్షియర్స్ వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పిటిషన్ల విచారణను తిరిగి తెలంగాణ హైకోర్టుకు సుప్రీంకోర్టు పంపింది. కేవలం టెక్నికల్ రీజన్స్‌తోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంగళవారం స్పష్టం చేసింది. కేసు మెరిట్స్‌లోకి తాము వెళ్లలేదని తెలిపింది.
Avinash Reddy Bail Petition: ఎంపీ అవినాష్ రెడ్డి(MP Avinash Reddy) ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో(Telangana High Court) గురువారం విచారణ జరిగింది. ఈ పిటిషన్‌పై సీబీఐ(CBI) తరఫు న్యాయవాది, పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రావణ్ వాదనలు వినిపించారు. ఎంపీ అవినాష్ రెడ్డి ద్వారా తనకు ప్రాణాహనీ ఉందని అప్రూవర్ దస్తగిరి(Dasthagiri) తరుపు కోర్టు దృష్టి తీసుకెళ్లారు.
Telangana: భూనిర్వాసితులకు పరిహారం ఇవ్వడంలో నిర్లక్ష్యం వహించడమే కాకుండా... కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోని వరంగల్ ఆర్డీవో అధికారులకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. వరంగల్ ఆర్డీవో కార్యాలయం జప్తునకు హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం సంచలనం రేపుతోంది. ఓ భూమి విషయంలో రైతులు పరిహారం ఇవ్వడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహిరంచడంతో కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది.
Telangana: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దానం ఎన్నికను రద్దు చేయాలంటూ కాంగ్రెస్ నేత విజయారెడ్డి హైకోర్టులో దాఖులు చేసిన పిటిషన్‌పై ఈరోజు (శుక్రవారం) హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది సుంకర నరేష్ వాదనలు వినిపించారు. ఎన్నికల్లో దానం నాగేందర్ ఓటర్లను ప్రలోభపెట్టారని న్యాయవాది కోర్టుకు చెప్పారు.
Andhrapradesh: కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌పై నమోదైన కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. 1999, 2003లో నకిలీ డీడీలతో బంగారం కొనుగోలు చేశారని... కందికుంట వెంకటప్రసాద్‌పై సీబీఐ రెండు కేసులు నమోదు చేసింది. ఒక కేసులో ఐదు సంవత్సరాలు... మరో కేసులో ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ అప్పట్లో నాంపల్లి సీబీఐ కోర్టు తీర్పు ఇచ్చింది.
Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు హైకోర్టులో చుక్కెదురైంది. పోలీస్ కస్టడీని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. నాంపల్లి కోర్టు కస్టడీని సవాలు చేస్తూ హైకోర్టులో ప్రణీత్ పిటిషన్ దాఖలు చేయగా.. విచారణ జరిగింది. నిన్న ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఈరోజు ప్రణీత్ రావు పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు హైకోర్టు తీర్పు వెల్లడించింది. ప్రణీత్ రావ్ కస్టడీపై కింది కోర్టు ఇచ్చిన కస్టడీ అనుమతి సరైందే అని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.
Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు వేసిన పిటిషన్‌పై మరికాసేపట్లో తీర్పు వెలువడనుంది. పోలీస్ కస్టడీని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రణీత్ రావు పిటిషన్‌పై నిన్న (బుధవారం) హైకోర్టులో విచారణ జరిగింది. కస్టడీకి ఎలాంటి కండిషన్లు పెట్టకుండా కింది కోర్ట్ ఆదేశాలు ఇచ్చిందని ప్రణీత్ తరపు న్యాయవాది వాదించారు. గత 4 రోజులుగా బంజారాహిల్స్ పీఎస్‌కు తాళం వేసి అక్కడే ప్రణీత్‌ను పోలీసులు విచారిస్తున్నారు.
Andhrapradesh: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు అయ్యింది. దేవిరెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రెండు లక్షల పోచికత్తు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ప్రతి సోమవారం సీసీఎస్ పోలీస్ స్టేషన్ ముందు హాజరుకావాలని తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రవేశించొద్దని హైకోర్టు షరతు విధించింది.
Telangana: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. తనకు 4 + 4 గన్ మెన్లను కేటాయించాలంటూ శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తనకు ప్రాణ హాని ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ ఈరోజు (మంగళవారం) విచారణకు రాగా... మాజీ మంత్రి అభ్యర్థునను ధర్మాసనం నిరాకరించింది.