Share News

KTR: కేటీఆర్‌ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 08 , 2025 | 03:07 PM

Telangana: మాజీ మంత్రి కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ సమయంలో న్యాయవాది సమక్షంలో విచారణకు అనుమతి ఇవ్వలేదని.. ఆడియో, వీడియో రికార్డు చేయాలని ఆదేశాలు ఇచ్చామన్న విషయాన్ని న్యాయస్థానం ప్రస్తావించింది.

KTR: కేటీఆర్‌ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Telangana High Court

హైదరాబాద్, జనవరి 8: ఫార్ములా ఈ కారు రేసు కేసులో (Formula E car case) ఏసీబీ (ACB) విచారణకు న్యాయవాదిని అనుమతించాలంటూ మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) వేసిన లంచ్‌ మోషన్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో (Telangana High court) బుధవారం వాదనలు జరిగాయి. కేటీఆర్‌ తరపున లాయర్ వాదనలు వినిపించారు. ఈ పిటిషన్‌పై తీర్పును సాయంత్రం 4 గంటలకు వెల్లడిస్తామని న్యాయస్థానం తెలిపింది. తీర్పును సాయంత్రానికి వాయిదా వేసింది. విచారణ సందర్భంగా హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ సమయంలో న్యాయవాది సమక్షంలో విచారణకు అనుమతి ఇవ్వలేదని.. ఆడియో, వీడియో రికార్డు చేయాలని ఆదేశాలు ఇచ్చామన్న విషయాన్ని న్యాయస్థానం ప్రస్తావించింది. ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ కేసులో తాము ఇచ్చిన ఆర్డర్‌ కాపీ చదివారా అని హైకోర్టు ప్రశ్నించింది. న్యాయవాదిని అనుమతించిన పలు సుప్రీం కోర్టు తీర్పులను కేటీఆర్‌ తరపు న్యాయవాది ప్రస్తావించగా.. న్యాయవాదిని విచారణ సందర్భంలో అనుమతి ఇవ్వని పలు తీర్పులను ఏఏజీ రజనీకాంత్ రెడ్డి ప్రస్తావించారు. ఏసీబీ విచారణ సమయంలో కనిపించేంత దూరంలో న్యాయవాది కనిపించేలా విచారణ గదులు ఉన్నాయా అని ఏఏజీని హైకోర్టు ప్రశ్నించింది.


‘‘ఒక రూంలో ఇన్వెస్టిగేషన్.. ఇంకో రూములో అడ్వకేట్ కూర్చుంటే ఏం ప్రాబ్లం.. ఏసీబీలో అలాంటి వసతులు ఉన్నాయా అని ఏఏజీని హైకోర్టు ప్రశ్నించింది. న్యాయవాదికి కేటీఆర్ కనిపించేలా విజిబుల్ డిస్టెన్స్‌కు ఏసీబీలో సౌకర్యం ఉందో లేదో చెప్పాలని ఏఏజీకి హైకోర్టు ఆదేశించింది. దీనిపై సాయంత్రం 4 గంటలకు చెబుతామని కోర్టుకు ఏఏజీ తెలిపింది. విచారణ గదిలోకి నిందితుడితో న్యాయవాదిని కలిసి అనుమతి ఇచ్చే ప్రసక్తే లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. కానీ ఇక్కడ కేటీఆర్ గతంలో మాజీ మంత్రి , ప్రస్తుత ఎమ్మెల్యే కాబట్టి.. న్యాయవాదికి కనిపించేలా విచారణ గదిలో ఏర్పాట్లు ఉన్నాయా అని హైకోర్టు ప్రశ్నించింది.

Formula E Case: ఏసీబీ వరుస ప్రశ్నలు.. షాక్‌లో ఐఏఎస్


కేటీఆర్‌పై థర్డ్ డిగ్రీ ఉపయోగించరు కదా అని న్యాయస్థానం ప్రశ్నించింది. కేటీఆర్‌పై థర్డ్ డిగ్రీ ఉపయోగించే అవసరం లేనప్పుడు.. ఇన్వెస్ట్‌గేషన్ రూమ్‌లో న్యాయవాది ఉండడం ఎందుకు అని ప్రశ్న వేసింది కోర్టు. ఒక ముగ్గురి న్యాయవాదుల పేర్లు ఇవ్వాలని కేటీఆర్ న్యాయవాదికి చెప్పిన ధర్మాసనం.. వారిలో ఒకరిని విజుబుల్ డిస్టెన్స్ వరకు మాత్రమే అనుమతి ఇస్తామని స్పష్టం చేసింది. అనంతరం తీర్పును ఈరోజు సాయంత్రం 4 గంటలకు హైకోర్టు వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి...

కుంభమేళాకు బయలుదేరిన శ్రీవారి కళ్యాణరథం

IT Raids: హన్సిత, అనిల్ కేస్.. తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 08 , 2025 | 03:23 PM