Home » Telangana High Court
Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు వేసిన పిటిషన్‌పై మరికాసేపట్లో తీర్పు వెలువడనుంది. పోలీస్ కస్టడీని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రణీత్ రావు పిటిషన్‌పై నిన్న (బుధవారం) హైకోర్టులో విచారణ జరిగింది. కస్టడీకి ఎలాంటి కండిషన్లు పెట్టకుండా కింది కోర్ట్ ఆదేశాలు ఇచ్చిందని ప్రణీత్ తరపు న్యాయవాది వాదించారు. గత 4 రోజులుగా బంజారాహిల్స్ పీఎస్‌కు తాళం వేసి అక్కడే ప్రణీత్‌ను పోలీసులు విచారిస్తున్నారు.
Andhrapradesh: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు అయ్యింది. దేవిరెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రెండు లక్షల పోచికత్తు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ప్రతి సోమవారం సీసీఎస్ పోలీస్ స్టేషన్ ముందు హాజరుకావాలని తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రవేశించొద్దని హైకోర్టు షరతు విధించింది.
Telangana: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. తనకు 4 + 4 గన్ మెన్లను కేటాయించాలంటూ శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తనకు ప్రాణ హాని ఉందని పిటిషన్లో పేర్కొన్నారు. శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ ఈరోజు (మంగళవారం) విచారణకు రాగా... మాజీ మంత్రి అభ్యర్థునను ధర్మాసనం నిరాకరించింది.
Telangana: హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు చిన్నారులు లేఖ రాయడం చర్చనీయాంశంగా మారింది. తాము ఆడుకునే పార్కు కబ్జాకు గురవుతుందంటూ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు చిన్నారులు లేఖ రాశారు. మొత్తం 23 మంది చిన్నారు ఈ లేఖ రాశారు. చిన్నారుల లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా హైకోర్టు స్వీకరించింది. అదిలాబాద్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో పార్క్ స్థలం ఉంది.
ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం సినిమాకు అడ్డంకులు తొలిగాయి. హైకోర్టు సూచనలతో వ్యూహం సినిమాకు రెండో సారి సెన్సార్ నిర్వహించారు. దీంతో సినిమాకు సెన్సార్ అడ్డంకులు తొలిగిపోయాయి.
Andhrapradesh: మార్గదర్శి కేసుల బదిలీపై సుప్రీం కోర్టులో విచారణ ముగిసింది. ఈ కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వ అప్పీల్స్‌పై స్టే ఇవ్వాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని మార్గదర్శికి సుప్రీం ధర్మాసనం సూచించింది.
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వస్తున్న వ్యూహం(Vyuham Movie) సినిమాపై తెలంగాణ హైకోర్టు ఇవాళ తీర్పు వాయిదా వేసింది. తీర్పును జనవరి 22కు వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. అప్పటివరకు గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని తెలిపింది.
Telangana: మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్‌కు హైకోర్టులో ఊరట లభించింది. సాహిల్‌ను అరెస్ట్ చేయవద్దని ధర్మాసనం తెలిపింది. పంజాగుట్ట కార్ ప్రమాదం కేసులో సాహిల్ వేసిన క్వాష్ పిటిషన్‌పై ఈరోజు (మంగళవారం) హైకోర్టులో విచారణ జరిగింది.
Telangana: టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘‘వ్యూహం’’ సినిమాపై కమిటీ వేయాలని తెలంగాణ హైకోర్టు నిర్ణయించింది. వ్యూహం సినిమాపై ఈరోజు హైకోర్టులో విచారణకు వచ్చింది.
Andhrapradesh: భారతి సిమెంట్స్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసులో భారతీ సిమెంట్స్ ఎఫ్డీలపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం ధర్మాసనం తోసిపుచ్చింది. భారతి సిమెంట్స్‌కు చెందిన రూ.150 కోట్ల ఎఫ్డీలను ఈడీ విడుదల చేయాలంటూ హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంలో ఈడీ సవాల్ చేసింది.