YS Viveka Case: వివేకా హత్య కేసులో కీలక నిందితుడికి బెయిల్
ABN , Publish Date - Mar 11 , 2024 | 05:01 PM
Andhrapradesh: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు అయ్యింది. దేవిరెడ్డికి హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రెండు లక్షల పోచికత్తు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ప్రతి సోమవారం సీసీఎస్ పోలీస్ స్టేషన్ ముందు హాజరుకావాలని తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రవేశించొద్దని హైకోర్టు షరతు విధించింది.
హైదరాబాద్/అమరావతి, మార్చి 11: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో (YS Viveka Murder Case) కీలక నిందితుడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరు అయ్యింది. దేవిరెడ్డికి తెలంగాణ హైకోర్టు (Telangana HighCourt) షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రెండు లక్షల పూచీకత్తు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ప్రతి సోమవారం సీసీఎస్ పోలీస్ స్టేషన్ ముందు హాజరుకావాలని తెలిపింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రవేశించొద్దని హైకోర్టు షరతు విధించింది. వీటితో పాటు దేవిరెడ్డి పాస్ పోర్ట్‌ను సరెండర్ చేయాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రేపు(మంగళవారం) దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి...
AP NEWS: విశాఖ రామానాయుడు స్టూడియోపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు
AP News: చంద్రబాబు నివాసంలో కొనసాగుతున్న కీలక భేటీ.. ఈ అంశాలపై చర్చ!
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..