Home » Thanneeru Harish Rao
కాంగ్రెస్ (Congress) అంటేనే కరువు, కరెంట్ కోతలు, మంచినీళ్ల కష్టాలు, అవినీతి అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. సోమవారం నాడు కొండాపూర్‌లో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో హరీష్ రావు సమావేశం అయ్యారు.
అబద్ధాలు ఆడడంలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harishrao) ఆరోపించారు.
అవినీతి పరులు ఎవరైనా బీజేపీ వదిలిపెట్టదని మెదక్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి రఘునందన్‌రావు (Raghunandan Rao) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మెదక్ పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ భారీ ర్యాలీ తీశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు హాజరయ్యారు.
లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ నేతలు ప్రచారానికి వస్తే బుద్ధి చెప్పడానికి మహిళలు, చీపుర్లు, చాటలతో సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) హెచ్చరించారు. గురువారం నాడ బెజ్జెంకిలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ప్రచారంలో భాగంగా హరీష్ రావు రోడ్ షో నిర్వహించారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress) 6 గ్యారంటీలు ఇస్తామని ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. సోమవారం నాడు జిల్లాలోని కోస్గిలో పర్యటించారు. ఈ సందర్భంగా నేతలకు లోక్‌సభ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు.
కాంగ్రెస్ (Congress), బీజేపీ పార్టీల మధ్య తమ అధికారం కాపాడుకోవటం కోసం రహస్య ఒప్పందం చేసుకున్నాయని మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harishrao) అన్నారు. ఆదివారం నాడు అందోలు మండలం తాడ్దాన్పల్లిలో ఈ నెల 16వ తేదీన బీఆర్ ఎస్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సభా స్థలిని హరీష్ రావు, జహీరాబాద్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పరిశీలించారు.
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏనాడైనా జై తెలంగాణ అన్నారా అని ప్రశ్నించారు. ఎన్నికల హామీలపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు.
Telangana: తెలంగాణలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఎమ్మెల్యే హరీష్‌రావు ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం కొండ భూదేవి గార్డెన్లో మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సిద్దిపేట పట్టణ కార్యకర్తల సమావేశంలో హరీష్ పాల్గొని ప్రసంగించారు. ‘‘మనం పదేళ్లు పాలించినం... వాళ్ళు వచ్చి నాలుగు నెలలు కాలేదు.. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది’’ అని అన్నారు. సిద్దిపేటలో సగం కట్టిన వెటర్నరీ కాలేజీని రద్దు చేసి కొడంగల్‌కు రేవంత్ రెడ్డి తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress)కి గట్టిగా బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) అన్నారు. గురువారం నాడు చిన్నకోడూరు మండలం పెద్ద కోడూర్లో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హరీష్ రావు, మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్ రాంరెడ్డి, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీపై చీటింగ్ కేసు పెట్టాలని మాజీ మంత్రి హరీష్‌రావు(Harishrao) అన్నారు. సోమవారం నాడు నర్సాపూర్‌లో నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో హరీష్‌రావు, ఎమ్మెల్యే సునీత రెడ్డి, ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు.