Share News

TG Politics: కాంగ్రెస్, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం.. హరీశ్‌రావు హాట్ కామెంట్స్

ABN , Publish Date - Apr 14 , 2024 | 10:17 PM

కాంగ్రెస్ (Congress), బీజేపీ పార్టీల మధ్య తమ అధికారం కాపాడుకోవటం కోసం రహస్య ఒప్పందం చేసుకున్నాయని మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌రావు (Harishrao) అన్నారు. ఆదివారం నాడు అందోలు మండలం తాడ్‌దాన్‌పల్లిలో ఈ నెల 16వ తేదీన బీఆర్ ఎస్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సభా స్థలిని హరీష్ రావు, జహీరాబాద్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పరిశీలించారు.

TG Politics: కాంగ్రెస్, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం.. హరీశ్‌రావు హాట్ కామెంట్స్

సంగారెడ్డి జిల్లా: కాంగ్రెస్ (Congress), బీజేపీ పార్టీల మధ్య తమ అధికారం కాపాడుకోవటం కోసం రహస్య ఒప్పందం చేసుకున్నాయని మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌రావు (Harishrao) అన్నారు. ఆదివారం నాడు అందోలు మండలం తాడ్‌దాన్‌పల్లిలో ఈ నెల 16వ తేదీన బీఆర్ ఎస్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సభా స్థలిని హరీశ్‌‌రావు, జహీరాబాద్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ పరిశీలించారు.


Ponguleti Srinivas Reddy: వచ్చే ఎన్నికల్లో బీజేపీకి చరమగీతం పాడాలి

ఈ సందర్భంగా హరీశ్‌‌రావుమాట్లాడుతూ... పార్లమెంట్ ఎన్నికల శంఖారావంలో భాగంగా జహీరాబాద్, మెదక్ పార్లమెంట్లకు సంయుక్తంగా 16 తేదీ జోగిపేట సమీపంలో కేసీఆర్ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ బహిరంగ సభకు అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నాడు కేసీఆర్ ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతు బంధు, రైతు భీమా, మిసషన్ కాకతీయ వంటి పథకాలు తీసుకొచ్చి రైతులకు అండగా నిలబడ్డారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతుల పరిస్థితి తిరోగమనం దిశగా సాగుతోందన్నారు. రాష్ట్రంలో వేల ఎకరాల్లో పంట ఎండిపోతోందని చెప్పారు.


TG Elections: రేవంత్‌ సమర్థుడు.. బీజేపీలోకి వస్తే స్వాగతిస్తాం: ధర్మపురి అర్వింద్ సంచలనం

రైతులు తమ వరి ధాన్యాన్ని తక్కువ ధరకే అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని చెప్పారు. ప్రభుత్వం మద్దతు ధరకు ధాన్యాన్ని కొనేలా తాము రైతులకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. బోనస్ ఇచ్చేలా ప్రభుత్వం మీద వత్తిడి తీసుకొస్తామని అవసరమైతే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో బీజేపీకి ఓటు వేస్తే మళ్లీ మోసపోతామని ఆలోచించుకోని లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తు చేసేలా పోస్ట్ కార్డ్ ఉద్యమం ప్రారంభించామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మర్చిపోయిన హామీలు గుర్తుకు వచ్చేలా రైతులు, యువకులు, మహిళలు, గొల్ల కురుమలు రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డులు రాయాలని హరీశ్‌‌రావు కోరారు.


ఇవి కూడా చదవండి

Asaduddin Owaisi: తేల్చాచెప్పేశారు... కాంగ్రెస్‏తో పొత్తు లేదు.. అవగాహన అసలే లేదు

TG Politics: తప్పుడు మార్గంలో రాజకీయాలు చేయొద్దు: వెంకట్ రాంరెడ్డి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 14 , 2024 | 10:18 PM