Home » Tirumala Laddu
సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ఏపీ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని మంత్రి కొల్లు అన్నారు.
తిరుమల శ్రీవేంకటేశ్వరుడ్డి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన సిట్ దర్యాప్తునే కొనసాగించాలా.. లేక కేంద్రం విచారణ జరిపించాలా అన్న అంశంపై సస్పెన్స్ శుక్రవారం వీడనుంది.
సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవిశ్వాసాలకు భంగం కలుగ చేసే చర్యలను అరికట్టేందుకు దేశవ్యాప్తంగా అమలయ్యేలా బలమైన చట్టాన్ని తక్షణమే తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఆ చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.
ప్రాయశ్చిత దీక్ష విరమించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మంగళవారం తిరుమలకు బయలుదేరారు. అలిపిరి మెట్ల మార్గం ద్వారా నరసింహ స్వామి దేవాలయం వద్దకు ఆయన చేరుకున్నారు.
సమీక్ష చేసిన తర్వాతే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిన విషయాన్ని ప్రజలకు సీఎం చంద్రబాబు తెలియజెప్పి ఉంటారని బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు ఎలా అమలవుతున్నాయనేది పరిగణలోకి కోర్టు తీసుకుంటుందని పురంధేశ్వరి పేర్కొన్నారు.
శ్రీవారి లడ్డూల నెయ్యి కల్తీ వ్యవహారంలో సిట్ అధికారులు తమ విచారణను విస్తృతంగా చేపడుతున్నారు. తిరుమలలో ప్రసాదాలకు వినియోగించే నెయ్యి, ఇతర ముడిసరుకుల నాణ్యతను పరీక్షించే ల్యాబ్కు సోమవారం ఉదయం 11 గంటలకు చేరుకున్నారు.
తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపఽథ్యంలో తమ నేతలకు తెలుగుదేశం పార్టీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో వాస్తవాలు చెప్పండి గానీ.. కోర్టులపై ఎటువంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టం చేసింది.
ఒకవైపు తిరుమల కొండమీద బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. టీటీడీ అధికారులూ, ఉద్యోగులూ ఆ పనుల్లో తలమునకలై ఉన్నారు. మరోవైపు ఇదే సమయంలో లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏర్పాటైన సిట్ కూడా దూకుడు పెంచింది.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. దీక్ష విరమణకుగాను మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం తిరుపతికి రానున్నారు.
తిరుమల వెంకన్న లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్.. తన వేగాన్ని పెంచింది. అందులోభాగంగా టీటీడీకి చెందిన పలువురు ఉన్నతాధికారులతో సిట్ బృందం భేటి అయింది. ఈ సందర్భంగా వారికి పలు ప్రశ్నలు సంధించింది.