Share News

TIrupathi Laddu Case: తిరుమల కల్తీ నెయ్యి కేసులో బిగ్ అప్డేట్

ABN , Publish Date - Apr 06 , 2025 | 01:22 PM

TIrupathi Laddu Case: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ అధికారులు దూకుడు పెంచారు. తమిళనాడులోని ఏఆర్ డెయిరీ, బోలేబాబా డెయిరీ, వైష్ణవి డెయిరీకు చెందిన వారిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే టెండర్ నిబంధనలను మార్చిన వారిపై కూడా అధికారులు దృష్టి పెట్టారు.

 TIrupathi Laddu Case:  తిరుమల కల్తీ నెయ్యి కేసులో బిగ్ అప్డేట్
TIrupathi Laddu Case

తిరుమల: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో త్వరలో మొదటి చార్జిషీట్‌ను సీబీఐ అధికారులు వేయనున్నారు. రాబోయే వారం రోజుల్లో చార్జిషీట్ వేసేందుకు సీబీఐ అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఆరుగురిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. తమిళనాడులోని ఏఆర్ డెయిరీ, బోలేబాబా డెయిరీ, వైష్ణవి డెయిరీకు చెందిన వారిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.


మొదటి చార్జిషీట్ వేసిన తర్వాత రెండోదశ దర్యాప్తును సీబీఐ అధికారులు చేపట్టనున్నారు. మొదటి దశలో పాత్రధారులను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. రెండో దశలో సూత్రధారులపై సీబీఐ అధికారులు ఫోకస్ పెట్టనున్నారు. తమిళనాడులోని ఏఆర్ డెయిరీకి టెండర్ దక్కేటట్లుగా టెండర్ నిబంధనలను మార్చిన సూత్రధారులపై దర్యాప్తు ప్రారంభం కానుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో పాలకవర్గంలోని కొంతమంది సభ్యులు, టీటీడీలోని కొంతమంది అధికారులపై ఇప్పటికే సిట్‌కు సమాచారం అందింది. రెండో దశలో వీరిపైనే సీబీఐ ఆధ్వర్యంలోని సిట్ అధికారులు ఫోకస్ పెట్టనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Sri Rama Navami: జగదభి రాముడు శ్రీరాముడు

‘కంచ’ దాటిన వ్యాఖ్యలు

తమిళ జాలర్లపై మానవత్వం చూపండి

For More AP News and Telugu News

Updated Date - Apr 06 , 2025 | 01:48 PM